తండ్రి కాబోతున్న హ్యాండ్సమ్ హంక్ రానా (Rana Daggubati).. త్వరలో దగ్గుబాటి అభిమానులకు గుడ్ న్యూస్!

Updated on Oct 26, 2022 12:11 PM IST
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా (Rana Daggubati) త్వరలో తండ్రి కాబోతున్నారని సమాచారం
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా (Rana Daggubati) త్వరలో తండ్రి కాబోతున్నారని సమాచారం

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా (Rana Daggubati) మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రానా త్వరలో తండ్రి కాబోతున్నారట. దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రానా, మిహిక దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. త్వరలో తమ అభిమానులు, సినీ ప్రేక్షకులకు ఈ దంపతులు శుభవార్త చెబుతారని టాక్. 

సోషల్ మీడియా నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవలే రానా చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అన్ని ఫొటోలను ఆయన తొలగించారు. దీంతో ఒక్కసారిగా రానా విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపించాయి. రానా–మిహికాలు విడిపోతున్నారా అనే అనుమానాలు వచ్చాయి. అయితే రానాతో దిగిన ఓ ఫొటోను మిహిక పోస్ట్ చేయడంతో వీటన్నింటికీ చెక్ పడింది. ఇప్పుడు ఈ దంపతులు పేరెంట్స్ కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 

రానాతోపాటు విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) చిన్న కూతురు కూడా గుడ్ న్యూస్ అందివ్వనున్నారని సమాచారం. వెంకీ చిన్న కూతురు అశ్రిత కూడా ప్రెగ్నెంట్ అయ్యారట. అందుకే ఈసారి దీపావళికి దగ్గుబాటి కుటుంబానికి డబుల్ ధమాకా అని తెలుస్తోంది. దీనిపై రానా లేదా దగ్గుబాటి ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఏదీ చెప్పలేం. 

ఇకపోతే, మిహికాను 2020 డిసెంబర్‌లో రానా పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరిద్దరి పెళ్లి వేడుక ఇరు కుటుంబాలకు చెందిన 30 మంది సన్నిహితులు, బంధువుల మధ్య జరిగింది. ఈ మ్యారేజ్‌కు సినీ పరిశ్రమ నుంచి సమంతతోపాటు రామ్ చరణ్​, ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాగ చైతన్య హాజరయ్యారు. కాగా, రానా ప్రస్తుతం పలు సినిమాలు, ఓ వెబ్ సిరీస్‌ షూటింగులతో బిజీగా ఉన్నారు. బాబాయ్ వెంకటేష్‌తో కలసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. 

Read more: అన్ని సినిమాలు అన్ని భాషలలోనూ రావాలి : రానా దగ్గుబాటి (Rana Daggubati)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!