'ఆహా' (Aha OTT) నుంచి సర్ ప్రైజ్.. ఓటీటీలో విడుదలైన విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘ఓరి దేవుడా’ (Ori Devuda)..!

Updated on Nov 11, 2022 10:12 AM IST
ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీగా అక్టోబరు 21న ‘ఓరి దేవుడా’ (Ori Devuda) థియేటర్లలోకి వచ్చింది. కానీ కేవలం 22రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలైంది.
ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీగా అక్టోబరు 21న ‘ఓరి దేవుడా’ (Ori Devuda) థియేటర్లలోకి వచ్చింది. కానీ కేవలం 22రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలైంది.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ (Mithila Palkar), ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన రీసెంట్ మూవీ ‘ఓరి దేవుడా’ (Ori Devuda). మొదటి రోజు నుండి పాజిటీవ్‌ టాక్‌తో ఈ సినిమా మంచి వసూళ్ళను సాధించింది. విశ్వక్‌ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది ‘పాగల్‌’ వంటి డిజాస్టర్‌ తర్వాత ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో మంచి శుభారంభం దక్కింది.

తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) తెరకెక్కించిన “ఓరి దేవుడా” చిత్రం తన ఒరిజినల్ చిత్రం “ఓహ్ మై కడవులే”కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కింది. మరి తెలుగులో అయితే ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కూడా అయ్యింది. ఈ సినిమాలో అగ్ర హీరో విక్టరీ వెంక‌టేష్ (Venkatesh) అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. పీవీపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్ర‌సాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాయ‌గా లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.

ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీగా అక్టోబరు 21న ‘ఓరి దేవుడా’ (Ori Devuda) థియేటర్లలోకి వచ్చింది. కానీ.. కేవలం 22 రోజుల వ్యవధిలో ఈ సినిమా ఓటీటీలోకి రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' (Aha OTT) వెల్లడించింది. ‘ఓరి దేవుడా’ సినిమాను ఇవాళ అర్ధరాత్రి నుండి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వారు ప్రకటించారు.

‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా కథ విషయంలోకి వెళితే.. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకే అపార్థాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటీ? వీళ్ళ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Read More: మరో వివాదంలో చిక్కుకున్న విశ్వక్ సేన్ (Vishwksen).. అలాంటి నటుడితో సినిమా తీయలేనంటున్న అర్జున్ (Arjun Sarja)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!