దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ (HeroAbhiram) హీరోగా తెరకెక్కిన 'అహింస' (Ahimsa) అదరగొడుతున్న ఫస్ట్ గ్లింప్స్!

Updated on Sep 10, 2022 02:28 PM IST
ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ (RP Patnaik) సంగీతం అందిస్తున్నాడు.
ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ (RP Patnaik) సంగీతం అందిస్తున్నాడు.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి పరిచయమవుతోన్న కొత్త హీరో అభిరామ్‌ (Hero Abhiram). దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన తేజ ప్రస్తుతం ఈ సినిమా ద్వారా అభిరామ్ ని పరిచయం చేయబోతున్నాడు. కాగా, గతంలోనే ఈ సినిమాకు 'అహింస' (Ahimsa) అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ప్రకటించారు మేకర్స్.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'అహింస' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ (Ahimsa First Glimpse) రిలీజైంది. 30 సెకండ్ల ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఆర్.పి పట్నాయక్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అభిరామ్‌కు జోడీగా గీతిక తివారి ఈ సినిమాలో నటిస్తోంది.

ఇక, గ్లింప్స్ లో హీరో పాత్రని ఓ అడవిలో కొందరు ముసుగుతో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోడానికి ప్రయత్నించడం, వాళ్ళు మళ్ళీ లాక్కొచ్చి కొట్టడం చూపించారు. ఇందులో తేజ (Director Teja) మార్క్ వయలెన్స్ కనిపిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే సినిమా చాలా రా&రస్టిక్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు టైటిల్‌ అహింస అని ఉండగా గ్లింప్స్‌లో మాత్రం హింసతో కూడిన సన్నివేశాలు ఉండడం ఆసక్తిని పెంచేసింది. 

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ (RP Patnaik) సంగీతం అందిస్తున్నాడు. చాలా కాలం తర్వాత, తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 'అహింస' కోసం కలిసింది. 

ఇక, ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. నటి సదా (Actress Sadaa), కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Read More: మెగా 'అభయం' : క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి లేఖ రాసిన 'చిరంజీవి (Megastar Chiranjeevi) !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!