రవితేజ (Raviteja), సిద్దు జొన్నలగడ్డ (Siddhu) మల్టీస్టారర్ గా ‘మానాడు’ (Maanaadu) సినిమా తెలుగు రీమేక్..!

Updated on Oct 18, 2022 12:00 PM IST
ఆద్యంతం ఉత్కంఠగా సాగే పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాని (Maanaadu) తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ బాబు హక్కులను కొనుగోలు చేసాడట.
ఆద్యంతం ఉత్కంఠగా సాగే పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాని (Maanaadu) తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ బాబు హక్కులను కొనుగోలు చేసాడట.

ఇటీవల కాలంలో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన కొన్ని సినిమాలలో ఒకటి ‘మానాడు’ (Maanaadu). ఈ సినిమాలో శింబు (Simbu) హీరోగా నటించగా.. ఎస్ జె సూర్య విలన్ రోల్ పోషించారు. అప్పటివరకు వరుస డిజాస్టర్ తో డీలాపడ్డ శింబు కెరీర్ ని మళ్ళీ దారిలోకి తెచ్చిన చిత్రం ఇది. వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

మరోవైపు.. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్యకి (SJ Surya) దాదాపు హీరో పాత్రకి ఉన్నంత స్క్రీన్ స్పేస్ ఉంది. ఇందులో ఎస్.జె.సూర్య ఒక పోలీస్ పాత్రలో నటించగా.. ఆయన పాత్ర ఒక హైలైట్ గా నిలిచింది. ఒక్కమాట లో చెప్పాలంటే కొన్ని సన్నివేశాలలో ఆయన పాత్ర హీరో పాత్రని కూడా డామినేట్ చేసేస్తుంది. ఇక, ఈ సినిమా తెలుగులో డబ్ అయినప్పుడు ఎస్.జె.సూర్య తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దీంతో డైలాగ్స్ కూడా హిట్ అయ్యాయి. 

అయితే, ఈ చిత్రం తెలుగు డబ్ వెర్షన్ ని థియేటర్స్ లో విడుదల చేయాలనుకుని, రీమేక్ (Maanaadu Remake) చేయాలన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో ఆపారు. ఓటీటీలో ఇప్పటికే తెలుగు డబ్ వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ‘మానాడు’ (Maanaadu) చిత్రం శింబు (Simbu) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ బాబు (Producer SureshBabu) హక్కులను కొనుగోలు చేసాడట. దర్శకత్వ బాధ్యతలను ఫిల్మ్ మేకర్ దశరధ్ కి అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ బాధ్యతలను హరీష్ శంకర్ కి అప్పగించినట్లు సమాచారం. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా మార్చే సత్తా కేవలం డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే ఉందని నమ్మిన సురేష్ బాబు ఆ బాధ్యతలను ఆయనకీ అప్పజెప్పాడట.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ముందుగా రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు అని అన్నారు. ఇప్పుడు మరొక విషయం బయటికి వస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు రీమేక్ లో శింబు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), ఎస్.జె. సూర్య రోల్ కోసం రవితేజను తీసుకోవాలని భావిస్తున్నారట.

అయితే విపరీతమైన మాస్ ఇమేజి ఉన్న రవితేజ (Hero Raviteja) ని నెగటివ్ రోల్ లో చూపిస్తే ఆయన అభిమానులు ఒప్పుకుంటారా, లేదా అనే సందిగ్ధంలో ఉన్న నిర్మాత సురేష్ బాబు కి ఉందట. దీంతో రవితేజను దర్శకుడు హరీశ్ శంకర్ అప్పజెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన ఇమేజి కి తగ్గట్టుగానే ఈ స్క్రిప్ట్ సిద్ధమైందని..తప్పకుండా ఆయన ఈ పాత్ర చేస్తాడని.. ఒప్పించే బాధ్యత నాది అని హరీష్ శంకర్ మాట ఇచ్చాడట. మరి రవితేజ ఆ పాత్ర చెయ్యడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి..ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు.

Read More: అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో సినిమా ప్లానింగ్ చేస్తున్న అగ్ర నిర్మాత ఎవరంటే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!