షూటింగ్ సెట్‌లోనే పూజా హెగ్డే (Pooja Hegde) పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన సల్మాన్‌ భాయ్, వెంకీ

Updated on Oct 15, 2022 04:02 PM IST
బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు
బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు

‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే (Pooja Hegde). తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పూజా.. బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు.

పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఈరోజు పూజా హెగ్డే పుట్టినరోజు. ఈ సందర్భంగా షూటింగ్ సెట్‌లో సల్మాన్‌ఖాన్, వెంకటేష్‌ కలిసి పూజ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు.  

బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు

ఫోటోలు వైరల్..

పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా పూజా.. ‘నేను ఎక్కువగా ప్రేమించేది నా పనిని, షూటింగ్‌ని. అలాంటి షూటింగ్ సెట్‌లోనే నేను కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇది నాకు ఒక మధుర జ్ఞాపకం. సెట్స్‌లో బర్త్ డే చేసుకోవడం ఆనందంగా ఉంది’ అని ఆమె పేర్కొంది. మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read More : 'పూజా హెగ్డే బ‌ర్త్ డే స్పెషల్' : మన "బుట్టబొమ్మ‌"కు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!