Anushka: అనుష్క సోషల్ మీడియాకి ఎందుకు దూరమైంది? ఆమెను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు?
Anushka: తెలుగు చిత్ర పరిశ్రమకు సరిగ్గా 17 సంవత్సరాల క్రితం పరిచయమైంది నటి అనుష్క. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన 'సూపర్' సినిమాతో అనుకోకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా, లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. అరుంధతి, భాగమతి, రుద్రమదేవి లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.
వరుసగా తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ తనదైన శైలిలో గుర్తింపుని పొందింది ఈ బ్యూటీ. మన ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించిన అనుష్కకు.. 'అరుంధతి ' లోని జేజమ్మ పాత్ర ఎంతో పేరు తీసుకొచ్చింది.
అనుష్క కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'జాతి రత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) సినిమాతో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది. కొత్త దర్శకుడు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌తో ఉన్న స్నేహం కారణంగానే, అనుష్క ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో అనుష్క వయస్సులో తనకంటే చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడుతుందని సమాచారం.
ఏదేమైనా, అనుష్క (Anushka) తన తోటి హీరోలు, దర్శక నిర్మాతలకు ఎంతో గౌరవం ఇస్తుంది. అందుకే ఆమెది దయాగుణం అని ఆమెను బాగా దగ్గరుండి చూసిన వారు చెబుతుంటారు. అలాగే స్నేహానికి కూడా అనుష్క ఎంతో విలువ ఇస్తుంది.
ఇక అనుష్కకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుష్కకు (Anushka Instagram Account) ఇన్ స్టాలో 5.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో అనుష్క సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా కూడా ఉండడం లేదు.
ప్రస్తుతం, అనుష్క ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా.. ఆమె మాత్రం కేవలం 23 మందిని మాత్రమే ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలో కావడం గమనార్హం. ఇక అనుష్క ఫాలో అవుతున్న వాళ్లలో తెలుగు హీరోలు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
ఆ హీరోలలో ఒకరు ప్రభాస్ (Prabhas) కాగా, మరొకరు రానా (Rana) కావడం గమనార్హం. ఇక హీరోయిన్ల విషయానికొస్తే రాశి ఖన్నా, నిహారిక, హన్సిక, కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లను అనుష్క ఫాలో అవుతున్నారు. తన సినీ కెరీర్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క, ఎందరో స్టార్లతో కలిసి నటించినా కూడా.. కేవలం 23 మందిని మాత్రమే ఫాలో కావడం విశేషమే కదా.
Read More: మరోసారి జంటగా ఓ సినిమా చేయబోతున్న ప్రభాస్-అనుష్క.. దర్శకుడు ఎవరంటే?