సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu)పై హీరోయిన్ భూమిక (Bhumika Chawla) ఇంట్రెస్టింగ్ కామెంట్స్..వైరల్‌

Updated on Oct 13, 2022 01:09 PM IST
టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించారు హీరోయిన్ భూమిక చావ్లా (Bhumika Chawla). దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి
టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించారు హీరోయిన్ భూమిక చావ్లా (Bhumika Chawla). దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి

యువకుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు భూమిక చావ్లా (Bhumika Chawla). ఆ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత తమిళంలో తెరకెక్కిన బద్రి సినిమాలో నటించారు భూమిక. పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఖుషి’, సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) నటించిన ‘ఒక్కడు’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ సరసన హీరోయిన్‌గా చేశారు భూమిక. భూమిక నటించిన అన్ని సినిమాలూ సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ధోని’ సినిమాలో సుశాంత్‌కు అక్క పాత్ర పోషించారు భూమిక. ఇక, తెలుగులో నేచురల్‌ స్టార్‌‌ నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ (మిడిల్‌ క్లాస్ అబ్బాయి)’ సినిమాలో హీరోకు వదినగా నటించారు.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించారు హీరోయిన్ భూమిక చావ్లా (Bhumika Chawla). దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి

ర్యాపిడ్‌ ఫైర్‌‌లో..

ఇటీవల మీడియాతో మాట్లాడిన భూమిక చావ్లా టాలీవుడ్ హీరోలపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలోని ర్యాపిడ్ ఫైర్‌‌ క్వశ్చన్స్‌కు ఆసక్తికర సమాధానాలిచ్చారు భూమిక. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గ్రేట్ డాన్సర్ అని చెప్పుకొచ్చారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ డాన్సర్‌‌ అని చెప్పారు. ఇక, పవర్‌‌స్టార్‌‌ పవన్ కల్యాణ్‌ ఇంటెలిజెంట్‌, విక్టరీ వెంకటేష్ స్పిరిచువల్‌ అని తెలిపారు భూమిక. అదే క్రమంలో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) వెరీ క్యూట్‌ అని కామెంట్‌ చేశారు. ఇటీవల రిలీజై సూపర్‌‌హిట్‌ అయిన సీతారామం సినిమాలో సుమంత్‌కు భార్యగా నటించారు భూమిక చావ్లా (Bhumika Chawla). 

Read More : ఖుషీ(Kushi) సినిమా ఓ అద్భుతం - భూమిక

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!