15 నిమిషాలకే అన్ని కోట్లా?.. ‘ఓరి దేవుడా’ కోసం వెంకీ (Venkatesh Daggubati) అంత రెమ్యూనరేషన్ తీసుకున్నారా?
యువ హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21న ఈ మూవీ రిలీజైంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. మూవీ బాగుందని మౌత్ టాక్ కూడా రావడం కూడా ‘ఓరి దేవుడా’కు కలిసొస్తోంది. దీంతో ఈ చిత్రం హిట్ దిశగా దూసుకెళ్తోంది.
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా ‘ఓరి దేవుడా’ తెరకెక్కింది. ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన అశ్వథ్ మారియుత్తునే తెలుగు వెర్షన్‌కూ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నెట్‌ఫ్లిక్స్ ‘లిటిల్ థింగ్స్’ ఫేమ్ మిథిలా పార్కర్‌తోపాటు కన్నడ భామ ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) చేశారు. ఈ క్యారెక్టర్ నిడివి కొద్దిసేపే అయినా.. కథను మలుపు తిప్పే ప్రధాన పాత్ర ఇది. దీంతో తెరపై కాసేపే కనిపించినా వెంకటేశ్ సినిమాకు హైలైట్‌గా నిలిచారు.
నిజంగా అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా?
‘ఓరి దేవుడా’ చిత్రంలో నటించేందుకు వెంకటేశ్ ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో కనిపించింది 15 నిమిషాలే అయినా యంగ్ హీరో రెమ్యూనరేషన్ స్థాయిలో వెంకీకి మేకర్స్ భారీ మొత్తాన్నే చెల్లించారని ప్రచారం జరుగుతోంది. ‘ఓరి దేవుడా’లో తన రోల్ కోసం వెంకీ కేవలం 5 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట. అయితే ఐదు రోజుల షూటింగ్, పదిహేను నిమిషాల పాత్ర కోసం ఆయనకు రూ.3 కోట్ల పారితోషికాన్ని మేకర్స్ ముట్టజెప్పారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇకపోతే, ‘ఓరి దేవుడా’లో సీనియర్ నటుడు మురళీ శర్మ, కమెడియన్ రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి.