Venkatesh: విక్టరీ వెంకటేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. థియేటర్లలోకి వచ్చేస్తున్న ‘నారప్ప’ (Narappa) మూవీ..!

Updated on Dec 07, 2022 01:42 PM IST
వెంకటేశ్ (Venkatesh) బర్త్ డే సందర్భంగా ఈ నెల 12న ‘నారప్ప’ (Narappa) మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు
వెంకటేశ్ (Venkatesh) బర్త్ డే సందర్భంగా ఈ నెల 12న ‘నారప్ప’ (Narappa) మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్స్‌గా నిలిచిన చిత్రాలను మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. స్టార్ హీరోల పుట్టిన రోజున వారు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలను అభిమానుల కోసం మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ మధ్య ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజుల సందర్భంగా వారి గత హిట్ సినిమాలను మేకర్స్ రీ రిలీజ్ చేశారు. 

కోలీవుడ్‌లో కూడా రీ రిలీజ్ ట్రెండ్ ఆరంభమైంది. సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘బాబా’ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రజినీ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 12న ఈ మూవీని తమిళనాడుతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో ‘బాబా’ను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ‘బాబా’ మూవీ ప్రింట్‌ను ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ మిక్సింగ్ చేసి అప్‌డేట్ చేశారు. రజినీకాంత్ కూడా కొత్త ఎడిట్‌లో కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడం విశేషం.  

ఇకపోతే, తాజాగా మరో తెలుగు చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటించిన ‘నారప్ప’ (Narappa) మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఆయన బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి అభిమానులకు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ గుడ్‌న్యూస్‌ అందించింది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేశారు. దీనిపై అప్పట్లో వెంకీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. బిగ్‌స్క్రీన్‌పై వెంకీ నటనను చూడలేకపోయామనే నిరాశలో ఆయన అభిమానులు ఉండిపోయారు. 

కేవలం ఒక్క రోజే స్క్రీనింగ్..! 
వెంకటేశ్
ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ‘నారప్ప’ మూవీని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. వెంకీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్‌ 13న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే ‘నారప్ప’ మూవీ థియేటర్లో సందడి చేయనుండటం గమనార్హం. కాగా, ‘నారప్ప’కు ఓటీటీలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మరి, థియేటర్లలో ఈ వెంకీ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. 

Read more: RRR: హాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ హవా.. జక్కన్న (Rajamouli) మూవీకి మరో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!