Sharukh Khan: షారుఖ్ ఖాన్ సినిమా జ‌వాన్‌లో 'రానా ద‌గ్గుబాటి' (Rana Daggubati )... ఏ పాత్ర‌లో న‌టిస్తున్నారంటే?

Updated on Jun 25, 2022 03:11 PM IST
 షారూక్ ఖాన్ జ‌వాన్ సినిమాలో  రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) విల‌న్‌గా న‌టించ‌నున్నార‌ట‌.
షారూక్ ఖాన్ జ‌వాన్ సినిమాలో రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) విల‌న్‌గా న‌టించ‌నున్నార‌ట‌.

బాహుబ‌లి సినిమాలో విల‌న్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఈ సినిమా త‌ర్వాత రానాకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సినిమాలో రానా న‌టిస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్‌లో రానా విల‌న్ పాత్ర‌లు చేయ‌నున్నారా?. బాలీవుడ్‌లో సౌత్ స్టార్ల‌కు డిమాండ్ పెరిగిందా? సౌత్‌, నార్త్ హీరోల మ‌ల్టీ స్టార‌ర్ సినిమాల‌పై స్పెష‌ల్ స్టోరి. 

బాలీవుడ్‌లో తెలుగు హీరోలు
టాలీవుడ్ స్టార్ల‌కు బాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. పాన్ ఇండియా సినిమాల‌తో తెలుగు హీరోలు, ద‌ర్శ‌కులు త‌మ స‌త్తా చాటుతున్నారు. టాలీవుడ్ సినిమాల్లో హిందీ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు. ఇదే క్రమంలో నార్త్ ఇండియాలో కూడా స‌క్సెస్ సాధించేందుకు సౌత్ డైరెక్ట‌ర్లు అక్క‌డి వాళ్ల‌తో విల‌న్ రోల్స్ చేయిస్తున్నారు.

ఇక సౌత్ డైరెక్ట‌ర్ల ఐడియాల‌నే నార్త్ ఇండియ‌న్ ద‌ర్శ‌కులు కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) బాలీవుడ్ సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు చేస్తున్నారనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

జ‌వాన్ మూవీలో విల‌న్‌గా రానా?
రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) బాహుబ‌లి త‌ర్వాత నార్త్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. రానాకు అక్క‌డ మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక రానా భార్య కూడా నార్త్ ఇండియ‌నే. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చాలా రోజుల త‌ర్వాత జ‌వాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.

జ‌వాన్ సినిమాలో రానా ద‌గ్గుబాటి విల‌న్‌గా న‌టించ‌నున్నార‌ట‌. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ జ‌వాన్ సినిమాలో న‌టిస్తున్నారు. అంత‌కు ముందు బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో రానా న‌టించినా.. అనుకున్నంత స‌క్సెస్ సాధించ‌లేక‌పోయారు. ఇక షారూక్ ఖాన్ జ‌వాన్ సినిమాతో త‌న ఫాలోయింగ్ పెంచుకోనున్నారు రానా.

 షారూక్ ఖాన్ జ‌వాన్ సినిమాలో  రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) విల‌న్‌గా న‌టించ‌నున్నార‌ట‌.

ఎంజాయ్ చేస్తున్న ఆడియ‌న్స్
ఇక బాలీవుడ్ న‌టీన‌టులు తెలుగు సినిమాల్లో న‌టించేందుకు పోటీ ప‌డుతున్నార‌ట‌. బాహుబ‌లి, కేజీఎఫ్, ఆర్ఆర్.ఆర్. సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వేల కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టాయి.

బాలీవుడ్ న‌టీన‌టులంతా ఇక సౌత్ సినిమాల్లో కూడా న‌టించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. చిరంజీవి న‌టించ‌బోయే 'గాడ్ ఫాద‌ర్ ' సినిమాలో స‌ల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు. ప్రేక్ష‌కులు మాత్రం నార్త్, సౌత్ అనే తేడా లేకుండా.. మ‌ల్టీస్టారర్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. 

Read More: Virata Parvam Review (విరాట ప‌ర్వం సమీక్ష): విప్లవ పోరాటాల నేపథ్యంలో సాగిన ఓ 'వెన్నెల' కథ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!