వెంకటేష్, విశ్వక్ సేన్ (Vishwak sen) మల్టీస్టారర్ మూవీ ‘ఓరి దేవుడా..’ (Ori Devuda) ట్రైలర్ అదిరిపోయిందిగా..!

Updated on Oct 08, 2022 01:41 PM IST
రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఓరి దేవుడా..' (Ori Devuda) చిత్రం అక్టోబర్‌ 21న విడుదల కానుంది.
రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఓరి దేవుడా..' (Ori Devuda) చిత్రం అక్టోబర్‌ 21న విడుదల కానుంది.

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా,నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. గతేడాది ‘పాగల్’ సినిమాతో పరాజయం అందుకున్న విశ్వక్.. ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. కాగా, ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

ఇక, విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ (Ori Devuda). తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కడవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో లవ్ గాడ్‌గా ఓ స్పెషల్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటిస్తున్నారు. 

రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఓరి దేవుడా..' (Ori Devuda) చిత్రం అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 

'ఓరి దేవుడా..' ట్రైలర్ (Ori Devuda Trailer) చూస్తుంటే విశ్వక్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారని అర్థమవుతోంది. చిన్నప్పటి నుంచీ స్నేహితులుగా ఉన్న అర్జున్ దుర్గరాజు, అను పాల్‌రాజ్ పెళ్లి చేసుకుంటారు. కానీ, పెళ్లి తర్వాత కొన్నాళ్లకే అపార్థాలతో వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే, వీళ్లు విడిపోవడానికి కారణాలు ఏంటీ? వీరిద్దరి సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. 

లైఫ్‌ మనకు ఇంకొక చాన్స్ ఇస్తే.. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను మార్చితే జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ట్రైలర్‌ చివర్లో ‘‘వైఫ్‌లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్‌.. కానీ ఫ్రెండ్‌ వైఫ్‌లా వచ్చిందనుకో’’ అంటూ వెంకటేష్‌కు (Hero Venkatesh) చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేసింది.

'ఓరి దేవుడా..' (Ori Devuda) సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak sen) సరసన మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లియన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read More: Ori Devuda: నా దేవుడు 'విక్టరీ వెంక‌టేష్' (Venkatesh) అంటున్న‌ విశ్వ‌క్‌సేన్ (Vishwaksen)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!