బెస్ట్‌ యాక్టర్‌‌గా నంది అవార్డు (Nandi Awards) అందుకున్న హీరోలు.. ఎవరు ఎన్నిసార్లు అందుకున్నారంటే?

Updated on Oct 08, 2022 07:08 PM IST
నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి
నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన అవార్డులే నంది అవార్డులు (Nandi Awards). 1964 నుంచి వివిధ కేటగిరీల్లో నంది అవార్డులను అందించడం మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. బెస్ట్‌ యాక్టర్‌‌ అవార్డు కేటగిరీని మాత్రం 1977లో మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది బెస్ట్‌ యాక్టర్ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వాళ్లలో హీరోలు ఎంతమంది. ఎవరు ఎక్కువసార్లు అందుకున్నారు అనే దానిపై ఒక లుక్‌ వేద్దాం.

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

విక్టరీ వెంకటేష్ (Venkatesh)

ప్రముఖ నిర్మాత రామానాయుడు కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు వెంకటేష్. తనదైన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడమే కాకుండా తన హావభావాలతో కన్నీళ్లు పెట్టించగలిగే సత్తా ఉన్న నటుడు వెంకటేష్. 1986వ సంవత్సరంలో విడుదలైన కలియుగ పాండవులు వెంకటేష్‌ నటించిన మొదటి సినిమా.

1989లో వెంకటేష్‌ హీరోగా చేసిన ప్రేమ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌‌గా నంది అవార్డు అందుకున్నారు వెంకటేష్‌. అనంతరం 1996లో రిలీజైన ధర్మచక్రం, 1998లో విడుదలైన గణేష్, 2000లో వచ్చిన కలిసుందాం..రా, 2007లో విడుదలైన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాల్లోని నటనకుగాను బెస్ట్ యాక్టర్‌‌గా నంది అవార్డులు అందుకున్నారు విక్టరీ వెంకటేష్. బెస్ట్‌ యాక్టర్‌‌గా మొత్తం అయిదుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. బెస్ట్‌ యాక్టర్‌‌గా ఎక్కువసార్లు నంది అవార్డు అందుకున్న హీరోగా నిలిచారు.

బెస్ట్‌ యాక్టర్‌‌గానే కాకుండా.. కలియుగ పాండువులు సినిమాకుగాను బెస్ట్‌ మేల్‌ డెబ్యూ యాక్టర్‌‌గా, 1988లో విడుదలైన స్వర్ణకమలం సినిమాకుగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు వెంకటేష్ (Venkatesh).

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు  (MaheshBabu)

సూపర్‌‌స్టార్, నటశేఖర కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి వచ్చారు మహేష్‌బాబు. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు ప్రిన్స్. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్‌బాబు.. తన అందం, నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. నటనలో వైవిద్యం కనబరుస్తూ ఎన్నో అవార్డులు గెలుచుకుంటున్నారు. ఇప్పటివరకు హీరోగా కేవలం 27 సినిమాల్లో మాత్రమే నటించిన మహేష్‌బాబు.. ఉత్తమ నటుడిగా నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

2003లో తేజ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటించిన సినిమా నిజం. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. అయినప్పటికీ ఆ సినిమాలోని మహేష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలోని నటనకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు మహేష్‌బాబు.  తర్వాత 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు, శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన దూకుడు, కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు సినిమాల్లోని నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌‌గా నంది అవార్డులు దక్కాయి. మొత్తం నాలుగుసార్లు నంది అవార్డు సాధించారు మహేష్‌బాబు (MaheshBabu).

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఆయన నటన, డ్యాన్స్‌, యాక్షన్, హావభావాలు అన్నిటికీ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక, చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉన్నంత మంది ఫ్యాన్స్‌ మరో హీరోకి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు 152 సినిమాల్లో నటించిన చిరు.. మూడుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డుల అందుకున్నారు.

1987వ సంవత్సరంలో విడుదలైన స్వయంకృషి సినిమాలోని నటనకు చిరంజీవి మొదటిసారి నంది అవార్డు అందుకున్నారు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు, 2002వ సంవత్సరంలో విడుదలైన ఇంద్ర సినిమాలోని నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌‌గా నంది అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు చిరంజీవి (Chiranjeevi)ని నంది అవార్డు వరించింది.

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

నటసింహం నందమూరి బాలకృష్ణ (BalaKrishna)

నందమూరి తారక రామారావు (సీనియర్‌‌ ఎన్టీఆర్‌‌) నటవారసుడిగా టాలీవుడ్‌లోకి వచ్చారు బాలకృష్ణ. 1974లోనే బాలనటుడిగా సినిమాల్లో నటించడం మొదలుపెట్టినా.. 1984వ సంవత్సరంలో సాహసమే జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. వైవిద్యమైన నటనతో, డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానాన్ని పొందుతున్న బాలకృష్ణ ఇప్పటివరకు మూడుసార్లు నంది అవార్డు గెలుచుకున్నారు.

2001లో ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన నరసింహనాయుడు సినిమాలోని నటనకుగాను ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ మొదటిసారి నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో విడుదలైన సింహా, 2014లో వచ్చిన లెజెండ్‌ సినిమాల్లోని నటనకు బెస్ట్‌ యాక్టర్‌‌గా నంది అవార్డు దక్కించుకున్నారు బాలయ్య. బాలకృష్ణ (BalaKrishna) కూడా ఉత్తమ నటుడిగా మూడుసార్లు నంది అవార్డు అందుకున్నారు.

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

‘కింగ్’ అక్కినేని నాగార్జున (Nagarjuna)

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా టాలీవుడ్‌లోకి వచ్చారు నాగార్జున. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు 30 సంవత్సరాలు గడుస్తున్నా.. యంగ్‌గా కనిపిస్తూ మన్మథుడు అని పిలిపించుకుంటుంటారు నాగ్. తన స్టైల్‌, యాక్టింగ్, కొత్తదనాన్ని ఎక్కువగా ప్రోత్సహించే నాగార్జున.. ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేయడానికి ఇష్టపడే నాగ్‌ ఎన్నో వైవిద్యమైన క్యారెక్టర్లు చేసి అభిమానులనే కాకుండా సినీ ప్రేమికులను కూడా అలరిస్తున్నారు.

1986లో విక్రమ్‌ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నాగార్జున. 1997లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య సినిమాలోని అద్భుత నటనకుగాను ఉత్తమ నటుడిగా మొదటిసారి నంది అవార్డు అందుకున్నారు నాగార్జున. అనంతరం 2002లో విడుదలైన సంతోషం, 2006లో వచ్చిన శ్రీరామదాసు సినిమాల్లోని ఉత్తమ నటనకు బెస్ట్ యాక్టర్‌‌గా నంది అవార్డు దక్కించుకున్నారు నాగ్. ఇప్పటివరకు నాగార్జున (Nagarjuna) మూడుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

లోకనాయకుడు కమల్‌ హాసన్ (Kamal Haasan)

1960వ సంవత్సరంలో చైల్డ్‌ ఆర్టిస్టుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కమల్‌ హాసన్. అప్పటి నుంచి చాలా సినిమాలే చేసినా కమల్‌కు నటుడిగా బ్రేక్ వచ్చింది మాత్రం అపూర్వ రాగంగళ్ సినిమాతోనే. ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించడం కమల్‌ ప్రత్యేకత. కమల్‌ నటనను దృష్టిలో ఉంచుకునే దర్శకులు సినిమా కథలను రాస్తుంటారు. తమిళం, మలయాళం, హిందీ, బెంగాలి, కన్నడతోపాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు కమల్.

1983లో విడుదలైన సాగర సంగమం సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు కమల్. 1986వ సంవత్సరంలో స్వాతిముత్యం, 1989లో ఇంద్రుడు చంద్రుడు సినిమాల్లో నటనకుగాను బెస్ట్ యాక్టర్‌‌గా నంది అవార్డులు కమల్‌ హాసన్‌కు దక్కాయి. ఇప్పటివరకు మూడుసార్లు నంది అవార్డులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)ను వరించాయి.  

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR)

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ 1991వ సంవత్సరంలో చైల్డ్‌ ఆర్టిస్టుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌‌. స్టూడెంట్‌ నంబర్‌‌1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్‌‌ హీరోగా ఎదిగారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్‌  ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్ అందరూ ఆయనను తారక్‌ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు.

జూనియర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్, యాక్షన్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. 2016 వ సంవత్సరానికిగాను ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ నటుడు అవార్డు ఎన్టీఆర్‌‌ (Junior NTR)కు దక్కింది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజీ సినిమాల్లోని నటనకుగాను బెస్ట్ యాక్టర్‌‌గా ఎంపికయ్యారు తారక్.

నంది అవార్డులు (Nandi Awards) చాలా కేటగిరీల్లో అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బెస్ట్‌ యాక్టర్‌‌ కేటగిరీ కూడా ఒకటి

వీళ్లే కాకుండా జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రవితేజ (RaviTeja), ప్రభాస్ (Prabhas), నాని (Nani), కూడా ఉత్తమ నటులుగా నంది అవార్డులు అందుకున్నారు. ఇక, 2016వ సంవత్సరం తరువాత రాష్ట్ర విభజనతోపాటు పలు సమస్యల కారణంగా ప్రభుత్వం నంది అవార్డుల (Nandi Awards)ను ప్రకటించలేదు.

Read More : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న యూవీ క్రియేషన్స్..రాధేశ్యామ్‌ నష్టాలు తీరేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!