‘ఓరి దేవుడా’ సినిమాలో వెంకటేష్‌ (Venkatesh)తో కలిసి నటించడం నా అదృష్టం: యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)

Updated on Oct 20, 2022 08:18 PM IST
యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) హీరోగా, వెంకటేష్‌ (Venkatesh) నటించిన ఓరి దేవుడా సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌‌ 21న విడుదలవుతోంది.
యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) హీరోగా, వెంకటేష్‌ (Venkatesh) నటించిన ఓరి దేవుడా సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌‌ 21న విడుదలవుతోంది.

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) నటించిన కొత్త సినిమా ఓరి దేవుడా!. విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో కీలకపాత్రను ఆశా భట్ పోషించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌‌ 21వ తేదీన ఓరి దేవుడా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

 ఓరి దేవుడా! సినిమా షూటింగ్ 2020వ సంవత్సరంలోనే మొదలైంది. 2021లోనే సినిమా విడుదల కావాల్సింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా కంటే ముందే ఈ ప్రాజెక్టు చేయాలని అనుకున్నాను. ఆ సినిమాలో కొంచెం వయసు ఎక్కువ ఉన్నవాడిగా నటించాను. ఓరి దేవుడా సినిమాలో యువకుడిలా కనిపిస్తాను. 

యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) హీరోగా, వెంకటేష్‌ (Venkatesh) నటించిన ఓరి దేవుడా సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌‌ 21వ తేదీన విడుదలవుతోంది.

ఎప్పటి నుంచో అనుకుంటున్నా..

వెంకటేష్‌, నాగార్జునతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఓరి దేవుడా సినిమాలో వెంకటేష్‌ గారితో కలిసి నటించడం నా అదృష్టం. జీవితంలో ఊహించని సర్‌‌ప్రైజ్‌ ఇది. సెట్స్‌లో వెంకటేష్‌ (Venkatesh) సార్‌‌తో చాలా ఎంజాయ్‌ చేశాను. సినిమాలో ఆయన ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.

ప్రేక్షకులకు పండుగే..

ఓరి దేవుగా సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అన్ని సినిమాలూ బాగా ఆడతాయని అనుకుంటున్నాను. మన ఇండస్ట్రీ  వరుసగా మూడు బ్లాక్‌ బస్టర్స్‌ అందుకోబోతోందని నిర్మాత సురేష్‌ బాబు గారు అన్నారు. సీతారామం, బింబిసార సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. సినిమాలు బాగుంటే ఈ దీపావళికి అన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు.

యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) హీరోగా, వెంకటేష్‌ (Venkatesh) నటించిన ఓరి దేవుడా సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌‌ 21వ తేదీన విడుదలవుతోంది.

నవంబర్‌‌లో మొదలు..
ఫలక్‌ నుమా దాస్‌-2 పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. వచ్చే ఏడాది చివరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అర్జున్‌ గారితో చేస్తున్న సినిమా షూటింగ్‌ నవంబర్‌ 3వ తేదీన మొదలవుతుంది.  వీటితోపాటు ధమ్‌కీ, గామి, రామ్‌ తల్లూరి కాంబినేషన్‌లో ఒక సినిమా కూడా మొదలుపెడతాం. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా గామి సినిమా ఆలస్యమైందని చెప్పుకొచ్చారు విశ్వక్‌సేన్ (Vishwak Sen).

Read More : Das Ka Dhamki: విశ్వక్ సేన్ (Vishwak Sen) “దాస్ కా ధ‌మ్కీ” సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!