‘ఖుషి’ (Kushi) సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (VIjay Devarakonda)!

Updated on Nov 05, 2022 10:07 AM IST
‘ఖుషి’ (Kushi) చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని విజయ్ దేవరకొండ (VIjay Devarakonda) అన్నారు
‘ఖుషి’ (Kushi) చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని విజయ్ దేవరకొండ (VIjay Devarakonda) అన్నారు

టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (VIjay Devarakonda) ఒకరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ యువ కథానాయకుడు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన విజయ్.. ‘అర్జున్ రెడ్డి’తో యూత్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి చిత్రాలతో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు. అయితే ‘లైగర్’ మూవీ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ డీలా పడ్డారు. పాన్ ఇండియా వైడ్‌గా హిట్ కొడదామనుకున్నప్పటికీ.. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. 

విజయ్ దేవరకొండ నుంచి కొత్త మూవీ రిలీజ్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘లైగర్’ (Liger) పరాజయాన్ని మర్చిపోయేలా బంపర్ హిట్ సినిమాను తమ హీరో అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ (Kushi) చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ స్టార్ సరసన సమంత (Samantha Ruth Prabhu) హీరోయిన్‌గా నటిస్తున్నారు. రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. 

‘ఖుషి’ చిత్రాన్ని తొలుత డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ‘ఖుషి’ విడుదలపై స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశామని విజయ్ అన్నారు. 

Samantha Ruth Prabhu

సమంతతో నటిస్తున్నందుకు హ్యాపీ

‘ఖుషి చిత్రం షూటింగ్ 60 శాతం వరకు పూర్తయింది. మొదట మేం ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ‘ఖుషి’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 2023 ఫిబ్రవరిలో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. ‘ఖుషి’ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సమంత గొప్ప నటి అని.. ఆమెతో కలసి నటిస్తున్నందుకు హ్యాపీగా ఉందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.  

గౌతమ్ తిన్ననూరితో మూవీకి ఓకే చెప్పాడా?

‘లైగర్’ వివాదానికి దూరంగా ఉండాలనుకుని డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)తో తీయాల్సిన ‘జనగణమన’ ప్రాజెక్టును విజయ్ దేవరకొండ పక్కనపెట్టారు. రీసెంట్ అప్‌డేట్ ప్రకారం ‘జెర్సీ’ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri)తో ఓ సినిమా కోసం విజయ్ చర్చలు జరిపారట. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. 

Read more: EXCLUSIVE: సెలబ్రిటీలనే ఫిదా చేసేసిన సాఫ్ట్‌వేర్ కుర్రాడు సుమంత్ బొర్రా (Sumanth Borra).. 'పడిపోయా' సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!