నువ్వు అద్భుతమైన అమ్మాయివి.. సమంతకు (Samantha Ruth Prabhu)కు ధైర్యం చెబుతూ చిరు (Chiranjeevi) ఎమోషనల్ పోస్ట్

Updated on Nov 01, 2022 11:54 AM IST
అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu)కు ధైర్యం చెబుతూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు
అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu)కు ధైర్యం చెబుతూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అనారోగ్యంపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రాశి ఖన్నా ఇలా చాలా మంది సమంత కోసం పోస్టులు పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. సమంత అనారోగ్యంపై రియాక్ట్ అయిన చిరు.. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సవాళ్లను తట్టుకుని నిలబడాలని ఆమెకు ధైర్యం చెప్పారు. 

‘మనందరి జీవితాల్లో కాలానుగుణంగా సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికితీయడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం కలిగిన ఓ అద్భుతమైన అమ్మాయివి. నువ్వు ఈ ఛాలెంజ్‌ను అధిగమించగలవని ఆశిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో నువ్వు దృఢవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడి కృప నీ వెన్నంటే ఉంటుంది’ అని చిరంజీవి రాసుకొచ్చారు. ఇది చూసిన సమంత.. చిరుకు థ్యాంక్స్ చెబుతూ రిప్లయ్ ఇచ్చారు. 

ఇకపోతే, సమంత ఆరోగ్యంపై కొంతకాలంగా పలు రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. సామ్ అనారోగ్యంగా ఉన్నారని.. ఆమె చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా సమంత స్పందించారు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఆమె వెల్లడించారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఒక ఫొటోను ఆమె షేర్ చేశారు. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని సమంత తెలిపారు. ఈ విషయాన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత అందరితో చెబుదామని అనుకున్నానని.. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందన్నారు. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని అర్థం చేసుకున్నానని సమంత వివరించారు.

ఇక, సమంత నటిస్తున్న కొత్త చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘యశోద’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 

Read more: షూట్ టైమ్‌లో సామ్ (Samantha Ruth Prabhu) యాక్టివ్‌గా ఉండేది.. ఆమె అనారోగ్యం గురించి మాకు తెలియదు: వరలక్ష్మీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!