Samantha Ruth Prabhu: డబ్బు కోసం నేనెప్పుడూ ఆరాటపడను.. మనీ కంటే యాక్టింగే ముఖ్యం: స్టార్ హీరోయిన్ సమంత

Updated on Dec 19, 2022 12:27 PM IST
మనకు ఉన్నదాంట్లో ఆనందంగా ఉండటం అలవాటు పడితే.. అవసరమైనవన్నీ మనల్ని అవే వెతుక్కుంటూ వస్తాయని హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అన్నారు
మనకు ఉన్నదాంట్లో ఆనందంగా ఉండటం అలవాటు పడితే.. అవసరమైనవన్నీ మనల్ని అవే వెతుక్కుంటూ వస్తాయని హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అన్నారు

టాలీవుడ్ టాప్ స్టార్ సమంత (Samantha Ruth Prabhu) నుంచి సినిమా వస్తోందంటే చాలు చూసేయడానికి ఆమె అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. పెద్ద హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ ఆమె మెరుస్తున్నారు. ‘యూటర్న్’, ‘ఓ బేబీ’, ‘యశోద’ సినిమాలే దీనికి ఉదాహరణ. అలాగే నటనకు ప్రాధాన్యం దొరికే పాత్రలు లభిస్తే వెబ్ సిరీస్‌లకూ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో ఆమె తనదైన నటనతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించారు. 

ఇటీవల ‘యశోద’ (Yashoda Movie) చిత్రంతో తన ఖాతాలో మరో హిట్‌ను వేసుకున్నారు సమంత. ప్రస్తుతం ఆమె రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘శాకుంతలం’ (Shakuntalam). గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాతోపాటు విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోనూ సామ్ యాక్ట్ చేస్తున్నారు. అయితే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరలో ‘ఖుషి’ చిత్రీకరణలో పాల్గొంటారని మూవీ యూనిట్ ఆశిస్తోంది. ఈ సమయంలో సామ్ ఓ భేటీలో తన మనోభావాలను పంచుకున్నారు. తనకు కోపం వస్తే జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తానన్నారు. అప్పుడు కోపం వెంటనే తగ్గిపోతుందన్నారు. 

ఇటీవల ‘యశోద’ (Yashoda Movie) చిత్రంతో తన ఖాతాలో మరో హిట్‌ను వేసుకున్నారు సమంత

డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం తాను ఆరాటపడనని సమంత అన్నారు. తనకు డబ్బు కంటే నటనే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. తాను చేసే ప్రతి పాత్రను ఆస్వాదిస్తానని, అలా యాక్ట్ చేయకపోతే అందులో ఎలాంటి ఆనందం, ప్రయోజనం ఉండదని సామ్ చెప్పారు. ‘నాకు నేను అతిపెద్ద విమర్శకురాలిని. మన తప్పొప్పులు, పొరపాట్లను తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలం. అయితే కాలం కలసి రాకపోతే ఏదీ జరగదు. అలాంటి సమయంలో చింతించకుండా ఆలోచనలను వదిలేసి నిద్రపోతా’ అని సమంత పేర్కొన్నారు. ‘నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. నువ్వు భూమి మీదకు వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో ఆనందంగా ఉండటం అలవాటు పడితే అవసరమైనవన్నీ మనల్ని అవే వెతుక్కుంటూ వస్తాయనేది నేను నమ్ముతా’ అని సమంత వివరించారు. 

Read more: Avatar: The Way of Water: "అవతార్ : ద వే ఆఫ్ వాటర్" చిత్రం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!