EXCLUSIVE: సెలబ్రిటీలనే ఫిదా చేసేసిన సాఫ్ట్‌వేర్ కుర్రాడు సుమంత్ బొర్రా (Sumanth Borra).. 'పడిపోయా' సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్ !

Updated on Nov 05, 2022 03:55 PM IST
సుమంత్ తాజాగా పాడిన 'పడిపోయా' సాంగ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆదిత్య మ్యూజిక్ లాంటి దిగ్గజ సంస్థ ఈ పాటను విడుదల చేసింది.
సుమంత్ తాజాగా పాడిన 'పడిపోయా' సాంగ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆదిత్య మ్యూజిక్ లాంటి దిగ్గజ సంస్థ ఈ పాటను విడుదల చేసింది.

సుమంత్ బొర్రా (Sumanth Borra).. ఈ యువకుడు పెరిగింది తెలంగాణలోని జమ్మిగుంట, కొత్తగూడెం లాంటి ప్రాంతాలలో అయినప్పటికీ, హైదరాబాద్‌లోనే సెటిలయ్యాడు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. వృత్తి ఐటి రంగమే అయినప్పటికీ, ప్రవృత్తి మాత్రం ఈ అబ్బాయికి సంగీతమే. భవిష్యత్తులో మ్యూజిక్‌నే ఫుల్ టైమ్ కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పే సుమంత్ తాజాగా పాడిన 'పడిపోయా' సాంగ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆదిత్య మ్యూజిక్ లాంటి దిగ్గజ సంస్థ ఈ పాటను విడుదల చేసింది. 

మెహర్ రమేష్, తరుణ్ భాస్కర్, గీతా భాస్కర్, సింగర్ దీపు మొదలైన సెలబ్రిటీలు ఈ 'పడిపోయా' పాటకు ఫిదా అయిపోయారట. ఈ పాటకు వెంకటేష్ వుప్పల సంగీతం అందించారు. సుమంత్, వెంకటేష్.. వీరిద్దరూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గతంలో ఒక బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు కూడా ఇచ్చారట. 

బాలు గారే ప్రేరణ

సుమంత్‌కు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారే ప్రేరణ. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చానని చెబుతూ ఉంటారు సుమంత్. కానీ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో ఇండిపెండెంట్ సాంగ్స్ రాయడం, వాటిని పాడడం.. తన స్నేహితుడితో కలిసి వాటిని కంపోజ్ చేయడంతో సుమంత్ ప్రతిభ నలుగురికీ తెలిసింది. వీరు తొలిసారిగా "ఎలా మరి ఇక రావా" అనే పాటను కంపోజ్ రాశారు. ఆ పాట పెద్ద హిట్. ఈ పాట ఇచ్చిన ప్రేరణతోనే తాము మరిన్ని పాటలను రాశామని.. ఈ క్రమంలో ఆదిత్య మ్యూజిక్ వారి ప్రోత్సాహాన్ని మరిచిపోలేమని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు సుమంత్. 

సోషల్ మీడియాలో దుమ్మురేపిన 'పడిపోయా' సాంగ్

'పడిపోయా' పాట ఓ వీడియో సాంగ్. ఈ పాటకు మల్లిక వల్లభ సాహిత్యాన్ని అందివ్వగా.. వెంకటేష్ వుప్పల సంగీతాన్ని అందించారు. నవీన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ వీడియో సాంగ్‌లో ఉపేంద్ర, వైష్ణవి లీడ్ పెయిర్‌గా నటించారు. ఈ పాటకు తన గానంతో ప్రాణం పోసిన సుమంత్‌కు ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. తన ఈ సక్సెస్ వెనుక తల్లి వాణీ శ్రీనివాస్, అలాగే సోదరి చందన ప్రోత్సాహం ఎంతో ఉందంటున్నారు సుమంత్. 

 

రికార్డింగ్‌లో మరో అయిదు పాటలు

'పడిపోయా' సాంగ్ సూపర్ హిట్ అయిన తర్వాత.. మరో అయిదు పాటలను రికార్డింగ్ చేయించే పనిలో ఉన్నారు సుమంత్. అయిదేళ్ల వయసులోనే వేద మంత్రాలను పొల్లు పోకుండా లయబద్ధంగా వల్లించడం నేర్చుకున్న సుమంత్, విద్యార్థి దశలో కూడా అనేక పాటల పోటీలలో పాల్గొనేవారట. జిల్లా స్థాయి బాలోత్సవ్ పోటీలలో వరుసగా 11 సార్లు విజేతగా నిలిచిన క్రెడిట్ కూడా ఈ యువకుడి పేరిట ఉంది. 

స్వరపరిచిన తొలి పాట

2016 లో 'గణ నాయక' పేరిట తెలుగు వన్ సంస్థ ఒక ఆల్బమ్ రిలీజ్ చేయగా, అందులో తొలిపాటను సుమంత్ పాడారు. ఆ పాట పాడే సమయానికి ఆయన గ్రాడ్యుయేషన్ చేస్తున్నారని, ఆ పాటలో విజువల్స్ బాగా రావడానికి స్నేహితులు ఎంతో తోడ్పాటునిచ్చారని చెబుతూ, ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు సుమంత్. అలాగే 2020 లో కూడా 'విశ్వం' పాటను తన స్నేహితుడు రాఘవ శర్మతో కలిసి రూపొందించారు సుమంత్. 

కంపోజింగ్‌లో కూడా ప్రత్యేకత

తనకు పాటలు పాడడం మాత్రమే కాదు.. పాటలను కంపోజ్ చేయడంలో కూడా ఆసక్తి ఉందని చెబుతుంటారు సుమంత్. మెలోడీ పాటలతో పాటు మెసేజ్ ఓరియంటెడ్, వెస్ట్రన్ క్లాసికల్ కాంబినేషన్ సాంగ్స్‌తో పాటు జానపద పాటలంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తన మదిలోని భావాలను బయటపెట్టారు సుమంత్.

 మరి మనం కూడా సుమంత్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా !

Read More: కష్టాన్ని కూడా ఇష్టపడాలి.. అదే నా విజయ రహస్యం : సంగీత దర్శకుడు రఘు కుంచె

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!