త్వరలో ఓటీటీలోకి ‘యశోద’ (Yashoda)!.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సమంత (Samantha Ruth Prabhu) మూవీ..?

Updated on Dec 06, 2022 04:51 PM IST
‘ఈవా’ ఆస్పత్రితో తలెత్తిన వివాదం పరిష్కారమవ్వడంతో ‘యశోద’ (Yashoda) చిత్రం త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది
‘ఈవా’ ఆస్పత్రితో తలెత్తిన వివాదం పరిష్కారమవ్వడంతో ‘యశోద’ (Yashoda) చిత్రం త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటించిన తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). లేడీ ఓరియంటెడ్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాకు హరి–హరీష్ దర్శకత్వం వహించారు. గత నెల 11న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ‘యశోద’ కలెక్షన్లలో దుమ్మురేపింది. యూఎస్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. 

‘యశోద’ చిత్రాన్ని వసూళ్ల పరంగా చూసుకుంటే ఓవరాల్‌గా రూ.30 కోట్లకు పైగా రాబట్టి సత్తా చాటింది. ముఖ్యంగా సమంత నటనకు ఆడియెన్స్‌తోపాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. పరిపక్వతతో కూడిన నటనను కనబర్చారని సామ్‌ను అందరూ మెచ్చుకున్నారు. ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న ఆమెలో ‘యశోద’ విజయం సరికొత్త జోష్‌ను నింపిందనే చెప్పాలి. 

 సమంత (Samantha Ruth Prabhu) నటించిన తాజా చిత్రం ‘యశోద’ (Yashoda

ఇకపోతే, ‘యశోద’ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సమంత అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ‘ఈవా’ వివాదంతో దీనికి బ్రేక్ పడింది. ఈ కాంట్రవర్సీకి సంబంధించి నిర్మాతలు ఆస్పత్రి వర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించారు. దీంతో లైన్ క్లియర్ అవ్వడంతో ‘యశోద’ను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 9న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి, థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన సామ్ మూవీ.. ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

కాగా, ‘యశోద’ను ఓ ఫ్రాంచైజీలా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం ఇటీవల నిర్వహించిన సక్సెస్ మీట్‌లో పేర్కొంది. సమంత ఒప్పుకుంటే సీక్వెల్ పట్టాలెక్కిస్తామని మేకర్స్ తెలిపారు. ‘యశోద 2’ విషయంలో మా దగ్గర ఓ ఆలోచన ఉంది. అంతేకాదు మూడో భాగానికీ ఒక లీడ్‌ ఉంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత.. ఆమెతో కూర్చొని చర్చిస్తాం. తను ఒప్పుకుంటే వెంటనే సీక్వెల్స్‌ పట్టాలెక్కిస్తాం. మా నిర్మాత కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. సెకండ్ పార్ట్‌లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అలాగే మా మూవీలో సూపర్‌ సైంటిస్ట్‌ ఉన్ని ముకుందన్‌ ఉన్నారు. ఆయన కూడా ఏమైనా చేయగలడు (నవ్వుతూ)’ అని చిత్ర దర్శకులు హరి–హరీష్ చెప్పుకొచ్చారు.

Read more: క్యాస్టింగ్ కౌచ్ కీర్తి సురేష్‌ (Keerthy Suresh) సంచలన వ్యాఖ్యలు.. ‘అది మన ప్రవర్తనను బట్టి కూడా ఉంటుందేమో’..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!