‘నేను గ్లామర్ గా ఉండటం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు (Dil Raju)!

Updated on Dec 16, 2022 02:31 PM IST
“టాలీవుడ్ లో బహుశా నేను గ్లామర్ గా ఉండటం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నాను’’ అని దిల్ రాజు (Dil Raju) అన్నారు.
“టాలీవుడ్ లో బహుశా నేను గ్లామర్ గా ఉండటం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నాను’’ అని దిల్ రాజు (Dil Raju) అన్నారు.

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్ల గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల విషయంలో తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, టాలీవుడ్ లోని మరికొంత మంది నిర్మాతలకు డిస్కషన్ జరుగుతోంది.

ఇక, పూర్తి వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు తమిళ స్టారీ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) తో ‘వారిసు’ (Varisu) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’గా విడుదల కాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. బాలయ్య కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీరసింహా రెడ్డి’ కూడా అదే రోజున విడుదల కానుంది. మరోవైపు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదల కానుంది. 

అయితే, టాలీవుడ్ నిర్మాతల మండలి సినిమాల విడుదల విషయలో తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దిల్ రాజు స్పందించాడు. తమిళనాడులో హీరో అజిత్ కంటే.. దళపతి విజయ్ పెద్ద హీరో అని.. కాబట్టి మాకు 50 థియేటర్లు ఎక్కవు ఇవ్వాలని సంచలన కామెంట్స్ చేశాడు. 

తమిళనాడులో మొత్తం 800 స్క్రీన్లు ఉండగా.. అజిత్ సినిమా ‘తునివు’ (Thunivu), విజయ్ సినిమా ‘వారిసు’కు (Varasudu) చెరో 400స్క్రీన్లు ఇవ్వాలని అక్కడి నిర్మాతల సంఘం నిర్ణయించింది. ఈ అంశంపైనే దిల్ రాజు స్పందిస్తూ ఈ కామెంట్లు చేశాడు. ‘సినిమా అనేది ఒక వ్యాపారం. దానిని ఏ రాష్ట్రంలోనూ తప్పుపట్టడం లేదు. అయితే టాలీవుడ్ లో మాత్రం థియేటర్ల సమస్య అనగానే నేనొక్కడినే అందరికీ కనిపిస్తాను’ అని ఆయన వాపోయాడు.

“టాలీవుడ్ లో బహుశా నేను గ్లామర్ గా ఉండటం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నాను’’ అని దిల్ రాజు (Dil Raju) అన్నారు. ఇక రెడ్ జెయింట్ బ్యానర్ పై అజిత్ నటించిన ‘తునివు’ సినిమాను హీరో, నిర్మాత అయిన ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నాడు. నేను ఆయన్ని కలిసి మాట్లాడుతాను అని దిల్ రాజు అన్నారు. విజయ్, అజిత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే మాకు థియేటర్లు పెంచాలని కోరుతున్నానని దిల్ రాజు తెలిపాడు.

Read More: Dil Raju ‘Varisu’: 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. ‘వారసుడు’ వివాదంపై దిల్ రాజు రియాక్షన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!