విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha) సరసన కృతి శెట్టి (Kriti Shetty).. ‘ఖుషి’ (Kushi) సినిమాలో అవకాశం?

Updated on Dec 05, 2022 06:40 PM IST
కృతి (Krithi Shetty) తొలిసారిగా 'ఖుషీ' (Kushi Movie) సినిమాలో నెగెటివ్ షెడ్స్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.
కృతి (Krithi Shetty) తొలిసారిగా 'ఖుషీ' (Kushi Movie) సినిమాలో నెగెటివ్ షెడ్స్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha) కలయిక కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ (Kushi Movie)సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత అనారోగ్యానికి గురవడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలోకి క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి (krithi shetty) చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కి ఛాన్స్ ఉందని.. దీంతో ఈ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

హ్యాట్రిక్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. యంగ్ బ్యూటీ స్పీడ్ కు స్టార్ హీరోయిన్లకే మతిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ రచ్చ చేస్తూ వస్తోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో కృతి శెట్టి పేరు హాట్ టాపిక్ గా నిలిచింది. కొత్త ప్రాజెక్ట్ లలో ఈ బ్యూటీని ఎంపిక చేసుకునేందుకు ఏమాత్రం సందేహించడం లేదు. ఇటీవల కొన్ని చిత్రాలు సక్సెస్ సాధించకున్నా.. కృతి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

హ్యాట్రిక్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. యంగ్ బ్యూటీ స్పీడ్ కు స్టార్ హీరోయిన్లకే మతిపోయింది.

‘ఉప్పెన’ (Uppena Movie) సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ‘బంగార్రాజు’తో రేంజ్‌ని పెంచుకుంది. కానీ ఈ ఏడాది వరుసగా రిలీజైన ఆమె మూడు సినిమాలు ‘ది వారియర్’, ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ డిజాస్టర్‌గా మిగిలాయి. దాంతో ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఆశలు కూడా ఈ ‘ఖుషీ’ సినిమాపైనే ఉండే అవకాశం ఉంది.

అయితే కృతి (Kriti Shetty) తొలిసారిగా ఈ సినిమాలో నెగెటివ్ షెడ్స్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సమంత కోలుకునే వరకు ఈమెతో షూటింగ్ కొనసాగించనున్నారని అంటున్నారు. ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఖుషీ మూవీలో సమంత, కృతి శెట్టి కాంబినేషన్‌లో కూడా కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Read More: 'ఖుషి' (Kushi) టైటిల్ పెట్టినందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గర్విస్తారంటున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!