TFCC: తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్​ కామర్స్ లేఖ

Updated on Dec 07, 2022 04:01 PM IST
సంక్రాంతి, దసరాకు తెలుగు చిత్రాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు టీఎఫ్‌సీసీ (TFCC) ఇటీవల లేఖ రాయడం తెలిసిందే
సంక్రాంతి, దసరాకు తెలుగు చిత్రాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు టీఎఫ్‌సీసీ (TFCC) ఇటీవల లేఖ రాయడం తెలిసిందే

దసరా, సంక్రాంతి పండుగ రోజుల్లో తెలుగు చిత్రాల ప్రదర్శనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ పలు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్​ కామర్స్ (Telugu Film Chamber of Commerce) లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగుతోపాటు పలు తమిళ టాప్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ పైవిధంగా అసోసియేషన్లకు సూచించింది. 2017లో తీసుకున్న నిర్ణయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లకు గుర్తు చేసింది.

దసరా, సంక్రాంతి పండుగ రోజుల్లో తెలుగు సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇటీవల లేఖ రాసిన విషయం విదితమే. దీనిపై తమిళ దర్శక నిర్మాతల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తమిళ సినిమాలను ఏపీ, తెలంగాణల్లో రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటే.. తెలుగు చిత్రాలను తమ రాష్ట్రంలో ప్రదర్శించనివ్వబోమంటూ కొందరు కోలీవుడ్ నిర్మాతలు హెచ్చరికలు కూడా చేశారు. మరి, తాజాగా ఏపీ, తెలంగాణల్లోని పలు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజుకునేలా కనిపిస్తోంది. 

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. కోలీవుడ్ స్టార్స్ విజయ్ ‘వరిసు’ (తెలుగులో ‘వారసుడు’), అజిత్ ‘తునివు’ కూడా పండక్కి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ‘వారసుడు’, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న విడుదల కానున్నాయి. ఇతర చిత్రాలు తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఒకే పండక్కి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లు లభిస్తాయనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పొంగల్ బరిలో ఉన్న సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను ఒకే నిర్మాణ సంస్థ రూపొందించడం గమనార్హం. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. 

Read more: RRR: హాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ హవా.. జక్కన్న (Rajamouli) మూవీకి మరో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!