‘జెర్సీ’ దర్శకుడితో సినిమా చేయనున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)! రౌడీ హీరోకి నచ్చిన స్టోరీ లైన్

Updated on Oct 20, 2022 02:30 PM IST
ఖుషి, జనగణమన సినిమా షూటింగ్స్ ఆలస్యమవుతుండడంతో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్టోరీలు వింటున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)
ఖుషి, జనగణమన సినిమా షూటింగ్స్ ఆలస్యమవుతుండడంతో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్టోరీలు వింటున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ రౌడీ హీరో.. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఆయన నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌‌గా నిలిచింది.

పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి కావాల్సి ఉన్నా.. సమంత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న కారణంగా షూటింగ్‌ ఆలస్యమవుతోందని టాక్.

ఖుషి, జనగణమన సినిమా షూటింగ్స్ ఆలస్యమవుతుండడంతో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్టోరీలు వింటున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)

స్టోరీ లైన్‌ నచ్చడంతో..

పూరీ జగన్నాథ్‌ డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ‘జనగణమన’ సినిమాలో కూడా నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలైంది. అయితే లైగర్ డిజాస్టర్‌‌ కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ అటకెక్కిందని టాక్. దీంతో విజయ్‌.. తన తర్వాతి సినిమా గురించిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్త స్క్రిప్టులు వింటున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే తన తర్వాత సినిమాకు ఓకే చెప్పారని కూడా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఫీల్ గుడ్ సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. జెర్సీ సినిమాలోని నటనకు నానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అలాగే దర్శకుడు గౌతమ్‌కి కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండను డైరెక్ట్‌ చేసే పనిలో ఉన్నారట గౌతమ్.

స్టోరీ లైన్‌ను కూడా చెప్పారని టాక్. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించడానికి పూర్తి స్టోరీని రెడీ చేయాలని కూడా ఈ రౌడీ హీరో చెప్పారని.. గౌతమ్ ఆ పనిలో ఉన్నారని సమాచారం. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటిస్తుందని టాక్.

Read More : విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ ఎఫెక్ట్‌.. అద్దె కట్టలేని స్థితిలో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!