శివ కార్తికేయన్ (SivaKarthikeyan) ఏడిస్తే బాధేసింది.. మాకు సినిమాలే లైఫ్: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

Updated on Oct 19, 2022 11:08 AM IST
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan)ను తాను సోదరుడిలా భావిస్తానని విజయ్ (Vijay Devarakonda) అన్నారు
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan)ను తాను సోదరుడిలా భావిస్తానని విజయ్ (Vijay Devarakonda) అన్నారు

హిట్టయినా, ఫ్లాపయినా సినిమా తప్ప తమకు మరేదీ తెలియదని పాన్ ఇండియా సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (SivaKarthikeyan)  హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్’ (Prince) ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో రౌడీ స్టార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో యాంకరింగ్ చేస్తూ స్టార్ హీరో స్థాయికి శివ కార్తికేయన్ ఎదిగారని.. ఆయన జర్నీ అందరికీ స్ఫూర్తిమంతంగా నిలుస్తుందని విజయ్ అన్నారు. 

శివన్న ఏడిస్తే తట్టుకోలేకపోయా

శివ కార్తికేయన్ ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటారు. కానీ ఓ వేడుకలో ఆయన ప్రసంగిస్తూ మధ్యలో కన్నీళ్లు పెట్టుకున్నారు. మాకు సినిమాలే జీవితం. సినిమాను ప్రేమిస్తూ, సినిమా కోసం ఇంత తపనపడే శివ లాంటి వ్యక్తి స్టేజీ మీద ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. తన జర్నీ, బాధను అర్థం చేసుకున్నా. అప్పుడే ఆయనపై ఒక సోదరుడి భావన కలిగింది. శివ కార్తికేయన్‌కు తోడుగా, అండగా ఉండాలని అనిపించింది. అందుకే ఈ కార్యక్రమానికి పిలవగానే రావడానికి ఒప్పుకున్నా’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. 

విజయ్ రాకెట్‌లా ఎదిగారు

భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న స్మార్ట్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరని శివ కార్తికేయన్ అన్నారు. తాను పదిహేనుళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నానని.. ఈస్థాయికి రావడానికి చాలా టైమ్ పట్టిందన్నారు. కానీ విజయ్ మాత్రం రాకెట్‌లా తక్కువ సమయంలో పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగారని శివ కార్తికేయన్ మెచ్చుకున్నారు. విజయ్ ఇంత అందంగా ఎలా ఉన్నారని తాను ఎప్పుడూ అనుకుంటానని.. అందుకే ఆయనకు అమ్మాయిల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండతో కలసి ఓ మూవీ చేయాలని ఉందని  శివ కార్తికేయన్ చెప్పారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మంచి కథను సిద్ధం చేస్తే.. తమ కాంబోలో సినిమా తెరకెక్కుతుందని వివరించారు. 

ఇకపోతే, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రిన్స్’ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది. దీపావళి కానుకగా రిలీజవ్వనున్న ఈ చిత్రాన్ని.. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా ఉక్రెయిన్‌కు చెందిన నటి మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Read more: ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా.. కానీ కుదర్లేదు: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!