'ఖుషి' (Kushi) టైటిల్ పెట్టినందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గర్విస్తారంటున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

Updated on Aug 24, 2022 05:15 PM IST
'లైగర్' ప్రమోషన్స్ (Liger Promotions) లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న విజయ్ కు 'ఖుషి' సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది.
'లైగర్' ప్రమోషన్స్ (Liger Promotions) లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న విజయ్ కు 'ఖుషి' సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది.

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 25న పాన్ ఇండియా రేంజ్ తెలుగు తో పాటు పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. 

'లైగర్' (Liger) సినిమా అనంతరం ఖుషీ, జనగణమణ (Janaganamana) సినిమాలు సెట్స్‌మీద ఉన్నాయి. యాక్షన్ ఎంటర్ టైనెర్స్ మధ్యలో 'ఖుషీ' (Kushi)  అనే లవ్ స్టోరీతో రాబోతున్నాడు విజయ్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖుషి మూవీ టైటిల్ తో విజయ్ సినిమా చేస్తుండడం తో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. 

ఈ తరుణంలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'లైగర్' ప్రమోషన్స్ (Liger Promotions) లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న విజయ్ కు 'ఖుషి' సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి స్థాయిలో మా ఖుషి సినిమా కూడా ఉంటుందని అన్నాడు. అప్పటి జనరేషన్ మొత్తానికి కూడా ఖుషి సినిమా ఒక అద్భుతం. అలాంటి సినిమా టైటిల్ ను మా సినిమాకు పెట్టినందుకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. 

మా ఖుషి సినిమా చూసిన తర్వాత తప్పకుండా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి అభిమానులు గర్విస్తారని పేర్కొన్నాడు. మరో మంచి ఖుషి సినిమా ను చూశాం అంటూ వారు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు అన్నట్లుగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే ఉంటుంది. అప్పుడు చెప్తాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ ను అలరిస్తుందో లేదో చూడాలి. 

Read More: Kushi: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై వ‌చ్చిన వార్త‌లు నిజం కాదంటున్న‌ ద‌ర్శ‌కుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!