'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అంటున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu).. రిలీజ్ ఎప్పుడంటే

Updated on Aug 09, 2022 06:51 PM IST
సుధీర్ బాబు (Sudheer Babu) న‌టించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.
సుధీర్ బాబు (Sudheer Babu) న‌టించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) న‌టించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ఆగ‌స్టు 10న ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా సుధీర్ బాబు త‌న కొత్త సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో సుధీర్ బాబు (Sudheer Babu) కు జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ కొన్ని కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు సుధీర్ బాబు సినిమా విడుద‌ల‌కు రెడీ అయింది. ఆగ‌స్టు 10న ఉద‌యం 11:07 నిమిషాలకు సినిమా విడుద‌ల తేదీని ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేస్తార‌ని టాక్.

 

'సమ్మోహనం' సినిమాతో సుధీర్ బాబు(Sudheer Babu) కు హిట్ ఇచ్చిన ఇంద్రగంటి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More: కొత్త బిజినెస్ మొద‌లు పెట్ట‌నున్న మ‌హేష్ బాబు (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!