కొత్త బిజినెస్ మొద‌లు పెట్ట‌నున్న మ‌హేష్ బాబు (Mahesh Babu)

Updated on Jul 30, 2022 07:23 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) రెస్టారెంట్ బిజినెస్ మొద‌లు పెడుతున్నార‌ని టాక్. మినర్వా గ్రూప్‌తో కలిసి రెస్టారెంట్ ఓపెన్ చేయ‌నున్నార‌ట‌.
మ‌హేష్ బాబు (Mahesh Babu) రెస్టారెంట్ బిజినెస్ మొద‌లు పెడుతున్నార‌ని టాక్. మినర్వా గ్రూప్‌తో కలిసి రెస్టారెంట్ ఓపెన్ చేయ‌నున్నార‌ట‌.

టాలీవుడ్‌లో రోజు రోజుకు ఫాలోయింగ్ పెంచుకుంటున్న హీరో సూప‌ర్ స్టార్  మ‌హేష్ బాబు (Mahesh Babu). మ‌హేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా రాణిస్తున్నారు. 'మేజ‌ర్' చిత్రాన్ని నిర్మించి అద్భుతం సృష్టించారు. చిన్న బ‌డ్జెట్ సినిమానే అయినా క‌లెక్ష‌న్ల‌లో మాత్రం పెద్ద బ‌డ్జెట్ సినిమా లెవ‌ల్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. మ‌హేష్ బాబు కొత్త వ్యాపారం మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌!

రెస్టారెంట్ బిజినెస్‌లోకి మ‌హేష్

మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టుడుగానే కాకుండా బిజినెస్‌మేన్‌గా కూడా రాణిస్తున్నారు. సినిమా నిర్మాణ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మ‌హేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ మొద‌లు పెడుతున్నార‌ని టాక్. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన మినర్వా గ్రూప్‌తో కలిసి భారీ స్థాయిలో రెస్టారెంట్ ఓపెన్ చేయ‌నున్నార‌ట‌. ఆ రెస్టారెంట్‌ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మిస్తున్నార‌ట‌.

మ‌హేష్ బాబు (Mahesh Babu) రెస్టారెంట్ బిజినెస్ మొద‌లు పెడుతున్నార‌ని టాక్. మినర్వా గ్రూప్‌తో కలిసి రెస్టారెంట్ ఓపెన్ చేయ‌నున్నార‌ట‌.

గౌత‌మ్ చ‌దువు కోసం లండ‌న్
మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న కొడుకు గౌత‌మ్ కోసం విదేశాల‌కు వెళ్లారు. గౌత‌మ్‌ను లండ‌న్‌లోని ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో చేర్పించ‌నున్నారు. గౌత‌మ్‌ను కాలేజ్‌లో జాయిన్ చేసేందుకు మ‌హేష్ బాబుతో స‌హా త‌న భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార కూడా వెళ్లారు.

ఆగ‌స్టు నుంచి మ‌హేష్ షూటింగ్
మ‌హేష్ (Mahesh Babu) లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చాక సినిమా షూటింగ్‌ల‌లో బిజీ కానున్నారు. ఆగస్టు నెలలో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. మ‌హేష్ బాబు పుట్టిన రోజు ఆగ‌స్టు 9. మ‌హేష్ బాబు పుట్టిన రోజు త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Read More: ‘SSMB28’: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం ఖరారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!