Macherla Niyojakavargam: థియేటర్లలో యావరేజ్.. ఓటీటీలో మాత్రం సూపర్ హిట్‌గా నిలిచిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

Updated on Dec 17, 2022 01:07 PM IST
‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ డిసెంబర్ 9 నుంచి జీ5లో టెలికాస్ట్ అవుతోంది. నితిన్ (Nithin) మూవీకి ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది
‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ డిసెంబర్ 9 నుంచి జీ5లో టెలికాస్ట్ అవుతోంది. నితిన్ (Nithin) మూవీకి ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది

ఇప్పుడో వెరైటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడిన సినిమాలు టెలివిజన్‌లో ఆ రేంజ్‌లో టీఆర్పీలు తెచ్చుకోలేకపోతున్నాయి. థియేటర్లలో ఫెయిల్ అయిన సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్టవుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయి. కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్’ చిత్రమే దీనికి ఉదాహరణ. బిగ్ స్క్రీన్స్‌లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఉత్సాహం చూపలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో దుమ్మురేపింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘వైల్డ్‌ డాగ్’ వరుసగా కొన్ని వారాల పాటు నంబర్ వన్‌గా నిలిచింది.

నాగ్ ‘వైల్డ్‌ డాగ్’లాగే స్టార్ హీరో నితిన్ (Nithin) నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కూడా ఓటీటీ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. నితిన్ సరసన బ్యూటీ క్వీన్ కృతి శెట్టి (krithi Shetty) జంటగా నటించిన ఈ మూవీ.. ఈ ఏడాది పంద్రాగస్టు కానుకగా ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైంది. ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో వచ్చినప్పటికీ లాంగ్ రన్‌లో మాత్రం ఈ సినిమా అంతగా వసూళ్లను తెచ్చుకోలేకపోయింది. థియేటర్లలో అంతగా సక్సెస్ కాలేకపోయిన ‘మాచర్ల నియోజకవర్గం’ ఇటీవలే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. 

విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా జీ5 పేరు తెచ్చుకుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) మూవీ డిసెంబర్ 9 నుంచి జీ5లో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు 75 మిలియన్స్ ప్లస్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చినట్లుగా జీ5 వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ లెక్కన థియేటర్లలో యావరేజీగా నిలిచిన నితిన్ సినిమా.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించినట్లుగానే చెప్పుకోవచ్చు. 

‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) మూవీ డిసెంబర్ 9 నుంచి జీ5లో టెలికాస్ట్ అవుతోంది

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో సముద్రఖని, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మతోపాటు వెన్నెల కిషోర్, ఇంద్రజ తదితరులు నటించారు. మాచర్లలో ఎన్నికలు జరగకుండా చూసే రాజప్ప (సముద్రఖని)ను.. ఆ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) ఎలా ఎదుర్కొన్నాడనేదే ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ కథ. స్వర సాగర్ మహతి అందించిన బాణీలు అటు క్లాస్‌తోపాటు ఇటు మాస్‌ను కూడా అలరించాయి. ‘రారా రెడ్డి’ అనే పాట మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దుమ్మురేపింది. ప్రసాద్ మూరెళ్ల ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 

Read more: Dil Raju: ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను.. తమిళ హీరోల వివాదంపై స్పందించిన నిర్మాత దిల్ రాజు 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!