Mahesh Babu AN Restaurant: భార్య పేరుతో రెస్టారెంట్.. ఏషియన్ సంస్థతో కలసి ఫుడ్ బిజినెస్‌లోకి మహేష్ ఎంట్రీ

Updated on Dec 08, 2022 11:13 AM IST
Mahesh Babu AN Restaurant: మహేష్ బాబు హోటల్ బిజినెస్‌లో కూడా మంచి విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు 
Mahesh Babu AN Restaurant: మహేష్ బాబు హోటల్ బిజినెస్‌లో కూడా మంచి విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు 

నటులు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం మామూలే. చాలా మంది స్టార్లు సినీ కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలోనే వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇటు చిత్రాలతోపాటు అటు బిజినెస్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ కోవలోకే వస్తారు. ఇప్పటికే ఏషియన్ గ్రూప్స్‌తో కలసి ఏఎంబీ సినిమాస్‌ను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. 

ఏఎన్ పేరుతో మహేష్ బాబు కొత్త రెస్టారెంట్‌ను మొదలుపెట్టారు. ఏ అంటే ఏషియన్ కాగా.. ఎన్ అంటే ఆయన భార్య నమ్రత అని తెలుస్తోంది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ పక్కన ఉన్న ప్యాలస్ హైట్స్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో నమ్రత ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది చాలా గ్రాండ్‌గా ఉందని.. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు ఈ రోజు రెస్టారెంట్‌కు రానున్నారని సమాచారం. ఇక మహేష్ ఫుడ్ బిజినెస్‌లోనూ సక్సెస్ అవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏఎన్ పేరుతో మహేష్ బాబు కొత్త రెస్టారెంట్‌ను మొదలుపెట్టారు.

ఇకపోతే, తండ్రి కృష్ణ మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేష్.. త్వరలో ఎస్ఎస్ఎంబీ28 షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్‌లో త్రివిక్రమ్, మహేష్, తమన్ కలిశారని సమాచారం. వీళ్లు కలసి డిన్నర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. రాజమౌళి సినిమాలో జాయిన్ అవ్వాలని మహేష్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది జూన్‌లో మహేష్–జక్కన్న మూవీ పట్టాలెక్కుతుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

మహేష్ తర్వాతి సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ లాంటి నటుడికి కథ రాయాలని చాలా మంది రచయితలు అనుకుంటారని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. మహేష్ చాలా ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని.. ఆయన నటించిన యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఆ తీవ్రత కనిపిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. మరి, మహేష్–రాజమౌళి కాంబో మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

Read more: ఐఎం‌డీబీ (IMDB) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 జాబితాలో ముగ్గురు తెలుగు హీరోలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!