చిన్నోడి (Mahesh Babu) కి హ్యాపీ బ‌ర్త్ డే అంటూ వెంకీ ట్వీట్ .. మ‌హేష్ మ‌రింత స‌క్సెస్ కావాలి - చిరంజీవి

Updated on Aug 09, 2022 01:50 PM IST
 టాలీవుడ్ హీరో, హీరోయిన్ల‌తో పాటు ద‌ర్మ‌క నిర్మాత‌లు మ‌హేష్ బాబు (Mahesh Babu) కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.
టాలీవుడ్ హీరో, హీరోయిన్ల‌తో పాటు ద‌ర్మ‌క నిర్మాత‌లు మ‌హేష్ బాబు (Mahesh Babu) కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా మ‌హేష్ బాబుకు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. టాలీవుడ్ హీరో, హీరోయిన్ల‌తో పాటు ద‌ర్మ‌క నిర్మాత‌లు మ‌హేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇత‌ర భాష‌ల‌కు చెందిన సినీ సెల‌బ్రిటీలు కూడా 'హ్యాపీ బర్త్ డే మ‌హేష్ బాబు' అంటూ ట్వీట్ చేశారు.

మ‌హేష్‌ది గొప్ప మ‌న‌సు - చిరు

మెగాస్టార్ చిరంజీవి మ‌హేష్ బాబు  (Mahesh Babu) కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు చిరు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు అని చిరంజీవి తెలిపారు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్‌ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని చిరంజీవి ట్వీట్ చేశారు. 

 

చిన్నోడా హ్యాప్తీ బ‌ర్త్ డే - వెంకీ

చిరంజీవితో పాటు వెంక‌టేష్ కూడా మ‌హేష్ బాబుకు బ‌ర్త్ డే విష‌స్ తెలిపారు. 'సీత‌మ్మ వాకిట్టో సిరిమ‌ల్లె చెట్టు' సినిమాలోని ఓ ఫోటోను వెంక‌టేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ సంవ‌త్స‌రం చిన్నోడి (మ‌హేష్ బాబు) కి మ‌రింత ఆనందం ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని వెంకీ మామ ట్వీట్ చేశారు.

ర‌వితేజ‌, ఎన్టీఆర్, సాయి ద‌ర‌మ్ తేజ్, సుధీర్ బాబు, రామ్ పోతినేని వంటి తెలుగు హీరోలు మ‌హేష్ బాబుకు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. హీరోల‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌క, నిర్మాత‌లు 'హ్యాపీ బ‌ర్త్ డే మ‌హేష్ బాబు' #HBDSuperstarMahesh అంటూ ట్వీట్  చేశారు. 

స‌రిలేరు నీకెవ్వ‌రూ

'శ్రీమంతుడు' సినిమా త‌రువాత మ‌హేష్ బాబు రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. అంతే కాకుండా ఎంతో మంది చిన్నారుల‌కు ఉచితంగా గుండె ఆప‌రేష‌న్ చేయిస్తున్నారు. మ‌హేష్ బాబు 'మాన‌వ సేవే మాధ‌వ సేవ' అని న‌మ్మిన వ్య‌క్తి. త‌న‌కు వీలైనంత సాయాన్ని ప్ర‌జ‌ల‌కు అందిస్తూ మ‌హేష్ బాబు.. మాన‌వ‌త్వం ఉన్న వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

Read More: 'హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు' (Mahesh Babu) .. సోష‌ల్ మీడియాలో ఈ రోజు అంతా 'ప్రిన్స్' మానియా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!