Hit 2: థియేటర్ రెస్పాన్స్ మర్చిపోలేను.. మహేష్ బాబు అలా అనడంతో కన్నీళ్లు ఆగలేదు..!: అడివి శేష్ (Adivi Sesh)

Updated on Dec 05, 2022 12:36 PM IST
తనను చూసి గర్వపడుతున్నానని మహేష్ బాబు (Mahesh Babu) చెప్పడంతో ఒక్కసారిగా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చేశాయని అడివి శేష్ (Adivi Sesh) అన్నారు 
తనను చూసి గర్వపడుతున్నానని మహేష్ బాబు (Mahesh Babu) చెప్పడంతో ఒక్కసారిగా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చేశాయని అడివి శేష్ (Adivi Sesh) అన్నారు 

టాలీవుడ్ నయా స్టార్ అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస హిట్లతో దూసుకెళ్తున్నారీ యంగ్ హీరో. ‘క్షణం’, ‘ఎవరు’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించిన శేష్.. ‘మేజర్’ మూవీతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘హిట్ 2’ (Hit 2) చిత్రంతో మరో హిట్‌ను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో స్టార్ నటుల లిస్టులో ఆయన చేరిపోయారని సినీ పండితులు చెబుతున్నారు. 

అడివి శేష్ ఓ సినిమా చేస్తున్నారంటే అందులో మంచి కథ, కథనాలు ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అందుకు తగ్గట్లే వరుసగా ఐదు విజయవంతమైన చిత్రాలను ఆయన అందించారు. తద్వారా టాలీవుడ్‌లో నయా స్టార్‌గా ఆయన అవతరించారు. ఇక శేష్ నటించిన తాజా చిత్రం ‘హిట్ 2’ మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ రెండో పార్ట్‌కు ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

ఇప్పుడు ‘హిట్ 2’ (Hit 2) చిత్రంతో మరో హిట్‌ను అడివి శేష్ తన ఖాతాలో వేసుకున్నారు

‘హిట్ 2’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండటంతో మూవీ టీమ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ వేదికపై అడివి శేష్ ఆసక్తికమైన విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా ఎలాంటి టాక్‌ను తీసుకొస్తుందా అని నేను చాలా టెన్షన్ పడ్డా. ఉదయాన్నే నిద్రలేవగానే మహేష్ బాబు (Mahesh Babu) గారి నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దీంతో వెంటనే ఆయనకు కాల్ చేశా’ అని శేష్ చెప్పుకొచ్చారు. తనను చూసి గర్వపడుతున్నట్లు మహేష్ చెప్పారని.. ఆ మాట వినగానే కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయన్నారు. ప్రసామ్ ఐమాక్స్ థియేటర్‌లో ‘హిట్ 2’కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యానని శేష్ పేర్కొన్నారు. 

ఇకపోతే, ‘హిట్ 2’ మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకొచ్చింది. విడుదలైన మూడ్రోజుల్లోనే దాదాపు రూ.14 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. ‘హిట్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.15 కోట్లు అని సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్‌ను సోమవారం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మంగళవారం నుంచి వచ్చే వసూళ్లతో చిత్రం లాభాలను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి, ఈ మూవీ బాక్సాఫీస్ రన్ ముగిసేసమయానికి ఎంత పెద్ద హిట్టుగా నిలుస్తుందో చూడాలి.  

Read more: Highest Paid Tollywood Heroes : 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరోలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!