అల్లు అర్జున్(Allu Arjun) మ‌హేష్ బాబు (Mahesh Babu) ను ఫాలో అవుతున్నారా?.. క్రేజీ యాడ్‌లో బ‌న్ని!!!

Updated on Aug 02, 2022 12:07 PM IST
అల్లు అర్జున్‌ (Allu Arjun)కు డిమాండ్ పెరిగింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబులానే అల్లు అర్జున్  కూడా ప‌లు యాడ్ ఫిలిమ్స్‌లో న‌టిస్తున్నారు.
అల్లు అర్జున్‌ (Allu Arjun)కు డిమాండ్ పెరిగింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబులానే అల్లు అర్జున్ కూడా ప‌లు యాడ్ ఫిలిమ్స్‌లో న‌టిస్తున్నారు.

టాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో బిజీగా ఉండే హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu). సినిమాల‌తో పాటు ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తుంటారు మ‌హేష్. మ‌హేష్ బాబు యాడ్స్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. మ‌హేష్ బాబుతో పాటు హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఈ మ‌ధ్య ప‌లు యాడ్స్‌లో న‌టిస్తున్నారు. యాడ్స్ కోసం అల్లు అర్జున్ కొత్త లుక్స్‌లో క‌నిపిస్తున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

యాడ్స్‌లో బిజీగా పుష్ప‌రాజు

'పుష్ప' స‌క్సెస్ త‌ర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. నార్త్‌లో తెగ పాపుల‌ర్ అయ్యారు. పుష్పరాజుగా అల్లు అర్జున్‌కు డిమాండ్ పెరిగింది. ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా అల్లు అర్జున్  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబులానే అల్లు అర్జున్ కూడా ప‌లు యాడ్ ఫిలిమ్స్‌లో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం బ‌న్ని దర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాడ్ ఫిలిమ్‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. కొత్త గెట‌ప్‌ల‌లో బ‌న్ని అద‌ర‌గొడుతున్నారు. అల్లు అర్జున్‌ రెగ్యుల‌ర్‌గా త‌న సోష‌ల్ మీడియాలో వెరైటీ గెట‌ప్‌ల‌తో ఫోటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. బ‌న్ని స్టైలిష్ ఫోటోలు సూప‌ర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అల్లు అర్జున్‌ (Allu Arjun)కు డిమాండ్ పెరిగింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబులానే అల్లు అర్జున్  కూడా ప‌లు యాడ్ ఫిలిమ్స్‌లో న‌టిస్తున్నారు.

ఆగ‌స్టు త‌ర్వాత‌ పుష్ప 2 షూటింగ్

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న‌ 'పుష్ప 2'లో న‌టిస్తున్నారు. ఆగ‌స్టు త‌ర్వాత 'పుష్ఫ 2' సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  రూ. 350 కోట్లతో నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప 2' లో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నార‌ని టాక్. సునీల్, అన‌సూయల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి 'పుష్ఫ 2'లో న‌టించ‌నున్నారు. 

Read More: 'పుష్పరాజు'ను గుర్తు ప‌ట్టారా?..యాడ్ ఫిలిమ్‌లో అద‌ర‌గొట్టిన హీరో (Allu Arjun)

అల్లు అర్జున్‌ (Allu Arjun)కు డిమాండ్ పెరిగింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబులానే అల్లు అర్జున్  కూడా ప‌లు యాడ్ ఫిలిమ్స్‌లో న‌టిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!