'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా కోసం.. ద‌ర్శ‌కుడిగా మారిన సుధీర్ బాబు (Sudheer Babu)!

Updated on Aug 10, 2022 02:23 PM IST
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబ‌ర్ 16 తేదిన రిలీజ్ కానుంది. సుధీర్ బాబు (Sudheer Babu) కు జోడిగా  కృతి  న‌టిస్తున్నారు.
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబ‌ర్ 16 తేదిన రిలీజ్ కానుంది. సుధీర్ బాబు (Sudheer Babu) కు జోడిగా కృతి న‌టిస్తున్నారు.

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతూ ఉంటారు. సుధీర్ బాబు ఇటీవలే న‌టించిన‌ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా సుధీర్ బాబు త‌న కొత్త సినిమా అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబ‌ర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు (Sudheer Babu) కు జోడిగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ కొన్ని కార‌ణాల‌తో ఈ ప్రాజెక్టు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు సుధీర్ బాబు సినిమా విడుద‌ల‌కు రెడీ అయింది.

సుధీర్ బాబు (Sudheer Babu), మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేషనులో తెర‌కెక్కుతున్న మూడో చిత్రం  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. అంత‌కు ముందు వీరి కాంబోలో ‘స‌మ్మోహ‌నం’, ‘వి’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

కొత్త పాత్ర‌లో సుధీర్

సుధీర్ బాబు ఈ చిత్రంలో సినీ ద‌ర్శ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.  సుధీర్ మైక్ ప‌ట్టుకొని, కృతి శెట్టితో ప‌రిగెత్తే స్టిల్‌తో ఉన్న పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇక  సినీ ద‌ర్శకుడి పాత్రలో సుధీర్ వెండితెర‌పై ఎలా న‌టించారో చూడాలంటే సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read More: కొత్త బిజినెస్ మొద‌లు పెట్ట‌నున్న మ‌హేష్ బాబు (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!