'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్ బాబు (Mahesh Babu)

Updated on Sep 05, 2022 06:23 PM IST
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న బావ సుధీర్ బాబు న‌టించిన‌ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న బావ సుధీర్ బాబు న‌టించిన‌ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali: టాలీవుడ్ హీరో  సుధీర్ బాబు న‌టించిన‌ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ట్రైల‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) లాంచ్ చేశారు. సుధీర్ బాబు సినిమా ట్రైల‌ర్ చాలా బాగుందంటూ మ‌హేష్ ప్ర‌శంసించారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఓ ద‌ర్శ‌కుడి ప్రేమ క‌థ‌లో సుధీర్ బాబు న‌టించారు.  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబ‌ర్ 16 తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో  సుధీర్ బాబు (Sudheer Babu) కు జోడిగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ కొన్ని కార‌ణాల‌తో ఈ ప్రాజెక్టు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు సుధీర్ బాబు సినిమా విడుద‌ల‌కు రెడీ అయింది.

ఆస‌క్తిగా సాగిన ట్రైల‌ర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న బావ సుధీర్ బాబు న‌టించిన‌ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఆస‌క్తిగా సాగింది. సుధీర్ బాబు ద‌ర్శ‌కుడి పాత్ర‌లో న‌టించారు. డాక్ట‌ర్‌గా ఉన్న కృతి శెట్టిని త‌న‌ సినిమాల్లో న‌టించాల‌ని సుధీర్ అడుగుతారు. అందుకు కృతి శెట్టి వాళ్ల త‌ల్లిదండ్రులు అడ్డు ప‌డ‌తార‌నే విష‌యం ట్రైలర్‌లో తెలిసేలా చేశారు ద‌ర్శ‌కుడు. సుధీర్, కృతి శెట్టీల‌ మ‌ధ్య ప్రేమ క‌థ ఎలా సాగుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. వెన్నెల కిషోర్ కామెడీని ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ కానుంది. 

సుధీర్ బాబు (Sudheer Babu), మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేషనులో తెర‌కెక్కుతున్న మూడో చిత్రం  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. అంత‌కు ముందు వీరి కాంబోలో ‘స‌మ్మోహ‌నం’, ‘వి’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Read More: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా కోసం.. ద‌ర్శ‌కుడిగా మారిన సుధీర్ బాబు (Sudheer Babu)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!