'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి సాంగ్ రిలీజ్!.. త‌న‌కు న‌చ్చిన‌ పాటన్న సుధీర్ బాబు ( Sudheer Babu)

Updated on Aug 30, 2022 06:43 PM IST
సుధీర్ బాబు (Sudheer Babu) సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'  నుంచి 'ఆ మెరుపేమిటో.. క‌నుపాప‌తో ఏమ‌న్న‌దో..'  సాంగ్‌ను విడుద‌ల చేశారు.
సుధీర్ బాబు (Sudheer Babu) సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి 'ఆ మెరుపేమిటో.. క‌నుపాప‌తో ఏమ‌న్న‌దో..' సాంగ్‌ను విడుద‌ల చేశారు.

టాలీవుడ్ హీరో  సుధీర్ బాబు (Sudheer Babu) విభిన్న‌మైన‌ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతూ ఉంటారు. సుధీర్ బాబు కొత్త సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఓ పాట‌ను రిలీజ్ చేశారు. ఇటీవ‌ల మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా సుధీర్ బాబు త‌న సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

సాంగ్ రిలీజ్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా నుంచి మేక‌ర్స్ ఓ పాట‌ను రిలీజ్ చేశారు. 'ఆ మెరుపేమిటో.. క‌నుపాప‌తో ఏమ‌న్న‌దో..' అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను అనురాగ్ క‌శ్య‌ప్ ఆల‌పించారు. ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం స‌మ‌కూర్చారు.  ఈ పాట‌కు లెజెండ్ రైట‌ర్ సిరివెన్న‌ల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు. స్లో మ్యూజిక్‌తో సాగే ఈ పాట త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సాంగ్ అంటూ హీరో సుధీర్ బాబు తెలిపారు. 

 

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబ‌ర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో  సుధీర్ బాబు (Sudheer Babu) కు జోడిగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ కొన్ని కార‌ణాల‌తో ఈ ప్రాజెక్టు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు సుధీర్ బాబు సినిమా విడుద‌ల‌కు రెడీ అయింది.

సుధీర్ బాబు (Sudheer Babu), మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేషనులో తెర‌కెక్కుతున్న మూడో చిత్రం  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. అంత‌కు ముందు వీరి కాంబోలో ‘స‌మ్మోహ‌నం’, ‘వి’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read More: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా కోసం.. ద‌ర్శ‌కుడిగా మారిన సుధీర్ బాబు (Sudheer Babu)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!