‘ఆచార్య’ (Acharya) కంటే తక్కువ కలెక్షన్స్!.. ‘గాడ్‌ఫాదర్’ (GodFather) తొలిరోజు వసూళ్లు ఎంతంటే..

Updated on Oct 13, 2022 12:15 PM IST
పాజిటివ్ టాక్ వచ్చినా తొలిరోజు కలెక్షన్లలో ‘ఆచార్య’ (Acharya) చిత్రాన్ని ‘గాడ్‌ఫాదర్’ (GodFather) అధిగమించలేకపోయింది
పాజిటివ్ టాక్ వచ్చినా తొలిరోజు కలెక్షన్లలో ‘ఆచార్య’ (Acharya) చిత్రాన్ని ‘గాడ్‌ఫాదర్’ (GodFather) అధిగమించలేకపోయింది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‍ఫాదర్’(GodFather) చిత్రం దసరా కానుకగా బుధవారం విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ మూవీ ఒకేరోజు రిలీజైంది. దర్శకుడు మోహన్ రాజా టేకింగ్‍తోపాటు చిరు, సత్యదేవ్ (Satya Dev) నటన బాగుండటంతో ఈ మూవీకి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అందరూ భావించారు. కానీ ఆశించిన రేంజ్‍లో మాత్రం వసూళ్లు రాలేదు.

‘గాడ్‍ఫాదర్’ తొలిరోజు కలెక్షన్లలో చిరంజీవి గత సినిమా ‘ఆచార్య’ (Acharya) కంటే వెనుకపడింది. ఫ్లాప్ టాక్‍తో కూడా ఆచార్య మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కానీ పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘గాడ్‍ఫాదర్’ అంతగా కలెక్షన్స్ సాధించలేదు. ఒరిజినల్ మూవీ ‘లూసీఫర్’ సినిమాను ఇప్పటికే చాలా మంది చూసి ఉండటంతో గాడ్‍ఫాదర్‌ను చూడటానికి ఆడియెన్స్ అంతగా ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది.

‘ఆచార్య’ ఎఫెక్ట్.. తగ్గిన వసూళ్లు

‘ఆచార్య’ సినిమాను సోలోగా ఎక్కువగా థియేటర్స్‌లో విడుదల చేశారు. కానీ ‘గాడ్‍ఫాదర్’ మూవీని తక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కూడా కలెక్షన్స్ తగ్గడానికి ఒక కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ‘ఆచార్య’ టికెట్లను మల్లీప్లెక్స్‌ల్లో మొదటిరోజు రూ. 350కు అమ్మితే.. ‘గాడ్‍ఫాదర్’ మూవీని రూ. 250కు అమ్మడమూ వసూళ్లపై ప్రభావం చూపిందంటున్నారు. అలాగే ‘ఆచార్య’ చిత్రం ఫెయిలవ్వడం కూడా చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్‍ఫాదర్’పై ఎఫెక్ట్ చూపిస్తోందంటున్నారు.

ఇకపోతే, ‘గాడ్‍ఫాదర్’ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.08 కోట్ల (31.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ సాధించింది. చిరంజీవి గత సినిమాలు ‘ఆచార్య’, ‘సైరా’లతో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్‌లో ఆయన చిత్రాల్లో అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చింది ‘గాడ్‍ఫాదర్’కు అనే చెప్పాలి. 

సెలవులు కలిసొచ్చేనా?

చిరంజీవి ‘గాడ్‍ఫాదర్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం..  ఇంకా రూ. 74.92 కోట్లు రాబట్టాల్సి ఉంది. అప్పుడే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. ఈ వారాంతం వరకు దసరా సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో మంచి పాజిటివ్ టాక్ రావడం కూడా ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు వీటితోపాటు మౌత్ టాక్ కూడా కలసి వస్తే చిరుకు మరో హిట్ దక్కినట్లేనని చెప్పొచ్చు. 

కాగా, మోహన్ రాజా తెరకెక్కించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించారు. హీరోయిన్ న‌య‌న‌తార‌తోపాటు సునీల్, బ్ర‌హ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ‘మ‌సూద్ భాయ్’ అనే పాత్ర‌లో న‌టించారు. గాడ్‌ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందించారు.

 Read more: ‘ఆచార్య’ విషయంలో అదొక్కటే బాధ.. సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!