‘ఆచార్య’ విషయంలో అదొక్కటే బాధ.. సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Updated on Oct 06, 2022 11:59 PM IST
ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాదర్ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది
ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాదర్ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ కావడంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ‘గాడ్‌ఫాదర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ సినిమా ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో విజయం వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 సంవత్సరాల్లోనే చాలా ఎదుర్కొన్నాను. మానసికంగా, శారీరకంగా అన్నింటినీ ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నాను. నటుడిగా పరిణతి చెందిన తర్వాత సినిమా పరాజయాలు నన్నెప్పుడూ బాధపెట్టలేదు. అలాగే విజయాన్ని తలకెక్కించుకోలేదు’ అని చెప్పారు చిరంజీవి.

ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాదర్ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది

బెస్ట్ ఇస్తాం అంతే..

‘సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌‌ అనేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మన పనిలో మనం బెస్ట్‌ ఇస్తామంతే. ‘ఆచార్య’ పరాజయం నన్ను బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేము చేశాం. ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క చిన్న విచారం ఏంటంటే.. చరణ్‌ నేను కలిసి మొదటిసారి సినిమా చేశాం. అది హిట్‌ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్‌ రాకపోవచ్చు. అంతకు మించి ఆచార్య ఫలితంపై ఎటువంటి బాధ లేదు’ అని వివరించారు మెగాస్టార్.

ధర్మస్థలి, పాదఘట్టం అనే ఆసక్తికర అంశాలతో ‘ఆచార్య’ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగెటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటించి సూపర్‌హిట్‌ సాధించిన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కింది. మోహన్‌రాజా దర్శకత్వం వహంచిన ఈ సినిమాలో మెగాస్టార్‌‌ చిరంజీవి (Chiranjeevi) తోపాటు సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలకపాత్రల్లో నటించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న గాడ్‌ఫాదర్‌‌ సినిమా విడుదల కానుంది.

Read More : ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!