భవిష్యత్తులో అవసరమైతే పవన్ (Pavan Kalyan)కు మద్దతిస్తానేమో!: చిరంజీవి (Chiranjeevi)

Updated on Oct 06, 2022 03:30 PM IST
పవన్ (Pavan Kalyan) లాంటి నిబద్ధత కలిగిన వాళ్లు రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి (Chiranjeevi) అన్నారు
పవన్ (Pavan Kalyan) లాంటి నిబద్ధత కలిగిన వాళ్లు రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి (Chiranjeevi) అన్నారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. గత వారం రోజులుగా ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తున్న ఈ మూవీ టీమ్.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో కథానాయకుడు చిరంజీవితోపాటు సినిమాలో నటించిన యంగ్ హీరో సత్యదేవ్, చిత్ర దర్శకుడు మోహన్ రాజా, నిర్మాత ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాసార్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

భవిష్యత్తులో అవసరమైతే తన తమ్ముడు పవన్ కల్యాణ్  (Pavan Kalyan)కు సపోర్ట్ చేస్తానంటూ చిరు ప్రెస్ మీట్‌లో కామెంట్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ నా తమ్ముడు.. భవిష్యత్‌లో తమ్ముడికి సపోర్ట్ ఇస్తానేమో’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘నా తమ్ముడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. పాలిటిక్స్‌కు నేను దూరంగా ఉండటం కూడా నా తమ్ముడికి హెల్ప్ అవుతోందేమో’ అని చిరు చెప్పారు. 

పవన్ లాంటి వాళ్లు పాలిటిక్స్‌లోకి రావాలి

రాజకీయాల్లో సోదరుడు పవన్ (Pavan Kalyan) కు తాను మద్దతు ఇస్తున్నట్లు ఇంతకుముందు ఎక్కడా ప్రకటించని చిరు, ఈ సారి మాత్రం క్లారిటీ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు అంకితభావం కలిగిన లీడర్ అవసరం ఉందన్నారు. ఆ అవకాశాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ లాంటి నిబద్ధత కలిగిన వాళ్లు రాజకీయాల్లోకి రావాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. 

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ప్రస్తుత పొలిటికల్ లీడర్స్‌కు సంబంధించి సెటైరికల్ డైలాగుల్లేవని మెగాస్టార్ స్పష్టం చేశారు. ఈ సినిమాకు మాతృక అయిన ‘లూసిఫర్’ స్టోరీ ఆధారంగానే ‘గాడ్ ఫాదర్’లోనూ సంభాషణలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని పేర్కొన్నారు.  

ఇక చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న సినిమా గాడ్‌ఫాద‌ర్‌ (Godfather). మోహ‌న్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా బుధవారం విడుదల కానుంది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి సూపర్‌‌హిట్ అయిన లూసిఫర్‌‌ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందింది.

గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) కీలకపాత్ర పోషించారు. లేడీ సూపర్‌‌స్టార్ నయనతార, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, గెటప్‌ శీను ముఖ్యపాత్రలు పోషించారు. ఆచార్య తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Read more: God Father: 'గాడ్ ఫాద‌ర్' సీక్వెల్‌కు రెడీ అంటున్న ద‌ర్శ‌కుడు మోహన్ రాజా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!