Salaar: స‌లార్‌లో రాఖీబాయ్‌... ప్రభాస్ (Prabhas) కోసం మ‌రో స్టార్‌ను రంగంలోకి దించుతున్న‌ ప్రశాంత్ నీల్!

Updated on Jul 03, 2022 06:22 PM IST
 ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న స‌లార్ కోసం ప్రశాంత్ నీల్ రాఖీభాయ్‌ను రంగంలోకి దించ‌నున్నార‌నే వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న స‌లార్ కోసం ప్రశాంత్ నీల్ రాఖీభాయ్‌ను రంగంలోకి దించ‌నున్నార‌నే వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న స‌లార్ సినిమా నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్ అందింది. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాల‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ప్ర‌శాంత్ నీల్ స‌లార్ కోసం ఊరికే ఉంటారా?. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ కోసం మైండ్ బ్లాక్ అయ్యే స్టోరిని సిద్ధం చేశార‌ట‌. ఇక స‌లార్ కోసం ప్రశాంత్ నీల్ రాఖీభాయ్‌ను రంగంలోకి దించ‌నున్నార‌నే వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ కోసం స్టార్ హీరోల‌ను రంగంలోకి దించ‌నున్నారా?.

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న స‌లార్ సినిమాలో య‌శ్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌.

స‌లార్‌లో య‌శ్ 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌శాంత్ నీల్ స్టార్ హీరోల‌ను రంగంలోకి దించుతున్నారు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2తో య‌శ్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. య‌శ్‌కు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్ సినిమాలో య‌శ్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌.

విక్ర‌మ్ సినిమాలో సూర్య‌లాగా స‌లార్ సినిమాలో య‌శ్ ఓ గెస్ట్ రోల్‌లో క‌నువిందు చేయ‌నున్నారు. ప్ర‌భాస్‌, య‌శ్‌ల‌తో ఉండే సీన్స్ సినిమాకే హైలెట్‌గా ఉండేలా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేశార‌ట‌. య‌శ్ స‌లార్ చిత్రంలో న‌టిస్తున్నార‌టే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. 

 పృథ్విరాజు త‌న సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని ప్ర‌భాస్  (Prabhas) తెలిపారు

య‌శ్‌తో పాటు మ‌రో హీరో
స‌లార్ సినిమాలో య‌శ్ న‌టిస్తున్నార‌న్న వార్త ప్రేక్ష‌కుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. య‌శ్‌తో పాటు మ‌రో హీరో కూడా ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తున్నార‌ట‌. మ‌ల‌యాళ స్టార్ ప్రృథ్విరాజ్ సుకుమార‌న్ స‌లార్‌లో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రం రిలీజ్ స‌మ‌యంలో ప్రృథ్విరాజ్ గురించి ఆశ‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. పృథ్విరాజు త‌న సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని ప్ర‌భాస్ తెలిపారు. 

 Prabhas: స‌లార్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడిగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు.

స‌లార్ షూటింగ్ క‌బుర్లు
ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్ సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. దాదాపు 60 శాతం స‌లార్ సినిమా షూటింగ్‌ను ప్ర‌శాంత్ నీల్ పూర్తి చేశార‌ట‌. రాధేశ్యామ్ ఫ్లాప్ త‌ర్వాత ప్ర‌భాస్ త‌న అభిమానుల కోసం త్వ‌ర‌గా త‌న సినిమాల‌ను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. 

ప్ర‌భాస్‌కు జోడిగా శృతి హాస‌న్
ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌లార్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడిగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. శృతి హాస‌న్ ఫ‌స్ట్ లుక్ కూడా మేక‌ర్స్ ఎప్పుడో రిలీజ్ చేశారు. శృతి హాస‌న్ ఈ సినిమాలో ఆద్య క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారు. 

  Prabhas: స‌లార్‌లో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నారు.

డ‌బుల్ రోల్‌లో ప్రభాస్!
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ బ‌డా డైరెక్ట‌ర్‌గా మారారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా స‌లార్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌లార్‌లో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నారు. పాత‌, కొత్త త‌రాల‌కు చెందిన రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో ప్ర‌భాస్ న‌టించ‌నున్నారు. అందుక‌నే ప్ర‌భాస్ మొన్న‌టి వ‌ర‌కు కాస్త హెవీగా క‌నిపించారు. ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లోకి మారారు. అంటే పాత త‌రం క్యారెక్ట‌ర్ కోసం ప్ర‌భాస్ (Prabhas) అలా మారార‌నే టాక్ వినిపిస్తుంది.

 Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ప్ర‌భాస్ కొత్త ప్రాజెక్టులు
ప్ర‌భాస్ (Prabhas) బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్‌లో న‌టిస్తున్నారు. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కెలో హీరో ప్ర‌భాసే. ఇక మారుతీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా, అర్జున్ రెడ్డి ఫేం సురేంద‌ర్ రెడ్డితో స్పిరిట్ సినిమాను ప్ర‌భాస్ చేయ‌నున్నారు. 

Read More : ఇంత స్లిమ్ లుక్ ఏంటి డార్లింగ్ అంటున్న ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్.. ఆదిపురుష్ టీమ్‌కు ఓం రౌత్ పార్టీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!