ఆదిపురుష్‌గా ప్ర‌భాస్ (Prabhas) ఎప్పుడు క‌నిపిస్తారో తెలుసా! .. బాహుబ‌లి కంటే ప‌దిరెట్లు వీడియో ఎఫెక్ట్స్ !

Updated on Jun 28, 2022 03:00 PM IST
ప్ర‌భాస్ (Prabhas) కూడా ఆదిపురుష్ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌.
ప్ర‌భాస్ (Prabhas) కూడా ఆదిపురుష్ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌.

బాహుబ‌లి సినిమాల త‌ర్వ‌త  ప్రభాస్ (Prabhas) ఇండియాలో గొప్ప న‌టుడుగా పేరు తెచ్చుకున్నారు. బాహుబ‌లిగా ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించిన ప్ర‌భాస్‌నుతన అభిమానులు పాన్ ఇండియా హీరోను చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు సినిమాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాల‌తో పాటు ద‌ర్శ‌కుడు మారుతీ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. 

అయితే ప్ర‌భాస్‌కు ఆదిపురుష్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం. ఈ చిత్రంలో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నారు.  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్‌ను మైథలాజికల్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. 

రాముడి అవ‌తారంలో  ప్ర‌భాస్

ఆదిపురుష్‌లో ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా ఎనిమిది అడుగుల ఎత్తులో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రామాయ‌ణంలోని రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో టీసిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

 

ప్ర‌భాస్ (Prabhas) కూడా ఆదిపురుష్ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌.

ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర‌ానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా దాదాపు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ట‌. బాహుబలి కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. ప్ర‌భాస్ కూడా ఆదిపురుష్ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌.

ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే!

ఆదిపురుష్ నుంచి ప్ర‌భాస్ (Prabhas) ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

స్లిమ్ లుక్‌లో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ అద్భుతంగా క‌నిపిస్తాడ‌ని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే త‌మ అభిమాన హీరో ప్ర‌భాస్ కొత్త సినిమాల‌కు సంబంధించిన ఫోటోల‌ను రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

 

సినిమా రేటు పెంచుతారా?

ఆదిపురుష్ (Adipurush) విడుద‌ల కంటే ముందే, భారీ బిజినెస్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకే ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేయ‌లేదు. ప్ర‌భాస్ సినిమా ఆదిపురుష్‌కు సంబంధించిన ప్ర‌తీ అప్‌డేట్ ట్రెండ్ సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టికెట్ రేటు కూడా పెంచాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉంద‌ట‌.

ఎందుకంటే ఆదిపురుష్ లాంటి సినిమాల టికెట్ రేటు ఎంతైనా ప్రేక్ష‌కులు చూస్తార‌ని నిర్మాత భూష‌ణ్ కూడా అంటున్నారు. సంక్రాంతికి బ‌రిలోకి దిగేందుకు ఆదిపురుష్ రెడీ అవుతుంది. 2023 జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read More: Adipurush:ఆదిపురుష్ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!