Tollywood : కేజీఎఫ్‌ నుంచి లవ్‌ టుడే వరకు.. 2022లో తెలుగులోనూ అదరగొట్టిన డబ్బింగ్ సినిమాలు

Updated on Dec 20, 2022 09:04 PM IST
వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.
వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

కథ బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. 2022వ సంవత్సరంలో అది మరోసారి రుజువైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే తెలుగు సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. వాటిలో విజయాల శాతం కూడా తక్కువేం కాదు. చిన్న పెద్ద సినిమాలు చాలానే రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.  

పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లానాయక్, సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు భారీ విజయాలు అందుకున్నాయి. ఇక, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించని ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్, చిరంజీవి, రాంచరణ్‌ నటించిన ఆచార్య, వరుణ్‌ తేజ్ గని, రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు పెద్దగా సందడి చేయలేదు.

అయితే, పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో రిలీజైన డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ క్రమంలో 2022లో విడుదలై తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించిన పరభాషా సినిమాలకు సంబంధించిన విశేషాలు పింక్‌విల్లా ప్రేక్షకుల కోసం..

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

కేజీఎఫ్‌2 (KGF2) :

సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్‌2. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కన్నడలో రూపొందింది.

కేజీఎఫ్‌ సినిమా తెలుగులో కూడా రికార్డులు సృష్టించడంతో సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో విడుదలైన కేజీఎఫ్‌2 వసూళ్ల సునామీ సృష్టించింది.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

విక్రమ్ (Vikram) :

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా విక్రమ్. చాలా కాలం తర్వాత కమల్‌కు తన రేంజ్‌ హిట్‌ దక్కించుకున్నారు ఈ సినిమాతో. దశావతారం సినిమా అనంతరం కమల్‌ నటించిన సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా తమిళంలో తెరకెక్కి.. పలు భాషల్లో విడుదలైంది.

విక్రమ్ సినిమా తెలుగులో కూడా విడుదలై రికార్డులు సృష్టించింది. కమల్‌హాసన్ నటన, లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వ ప్రతిభ, కథ అన్నీ కలిసి ఈ సినిమాను సూపర్‌‌హిట్‌గా నిలబెట్టాయి.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

కాంతార (Kantara) :

కన్నడలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. రిషబ్‌శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

కాంతార సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార సినిమా తెలుగులో కూడా భారీ వసూళ్లు సాధించింది.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

సర్దార్ (Sardar) :

కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన క్రేజీ సినిమా సర్దార్. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే కార్తి ఈ సినిమాలో వివిధ గెటప్స్‌లో కనిపించారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో కూడా విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆవారా, ఊపిరి, ఖాకీ, ఖైదీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కార్తి. ఈ క్రమంలో కార్తి నటించిన సినిమాలు టాలీవుడ్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

లవ్‌ టుడే (Love Today) :

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా లవ్‌ టుడే. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో లవ్‌ టుడే సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేశారు. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించారు.

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే జంట.. ఒకరోజు ఒకరి ఫోన్‌ను మరొకరు తీసుకుంటే జరిగే పరిణామాలు ఏంటి అనే అంశంతో తెరకెక్కింది లవ్‌ టుడే సినిమా.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) :

క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం (ManiRatnam) దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ సినిమా పొన్నియిన్ సెల్వన్. చియాన్ విక్రమ్ (Vikram), కార్తి (Karthi), ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), త్రిష (Trisha) ప్రధాన పాత్రలుగా సినిమా రూపొందింది. ప్రముఖ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మణిరత్నం. తమిళంతోపాటు పలు భాషల్లో పొన్నియిన్ సెల్వన్ విడుదలైంది.

మొత్తం రెండు భాషల్లో పొన్నియిన్ సెల్వన్‌ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు మణిరత్నం. మొదటి భాగం ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకోగా.. రెండో భాగాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

విక్రాంత్‌ రోణ (Vikranth Rona) :

కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) హీరోగా తెరకెక్కిన సినిమా విక్రాంత్‌ రోణ. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి ప్రధాన పాత్రలు పోషించారు.  అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌‌ జోనర్‌‌గా తెరకెక్కిన విక్రాంత్ రోణ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది.

2022, జూలై 28న విడుదలైన విక్రాంత్ రోణ సినిమాలోని ‘రారా రక్కమ్మ’ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తెలుగులో విడుదలైన విక్రాంత్‌ రోణ మంచి కలెక్షన్లు రాబట్టింది.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

డాన్ (Don) :

శివకార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా తెరకెక్కిన సినిమా డాన్. ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని, ఎస్‌జే సూర్య కీలకపాత్రలు పోషించారు. ఎమోషనల్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందిన డాన్‌ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

శివ కార్తికేయన్‌ డాన్ సినిమా తమిళంతోపాటు తెలుగులో ఏకకాలంలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టిందని టాక్. తెలుగులో కూడా మంచి కలెక్షన్లు సాధించింది.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

బీస్ట్‌ (Beast) :

విజయ్ (Vijay), పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బీస్ట్‌. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. అయితే విజయ్ క్రేజ్‌తో బీస్ట్ సినిమాకు ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి. నెల్సన్‌ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హైజాక్ డ్రామా, పొలిటికల్ సెటైరికల్ జోనర్‌‌తో తెరకెక్కింది.

తెలుగులో కూడా విజయ్‌కు మంచి మార్కెట్ ఉండడంతో.. బీస్ట్‌ సినిమాకు తెలుగులో కూడా ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి.

వరుసగా తెలుగు సినిమాలు విడుదలై విజయవంతమవుతున్న సమయంలో కూడా డబ్బింగ్ సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.

నేనే వస్తున్నా.. (Nene Vasthunnaa) :

ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కిన సినిమా నేనే వస్తున్నా. ఎలీ అవ్రామ్, ఇందుజా రవీంద్రన్, సెల్వ రాఘవన్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. కలైపులి ఎస్‌ ధాను నిర్మించిన నేనే వస్తున్నా సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ధనుష్ ద్విపాత్రాభినయం చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మారి, రఘువరన్‌ బీటెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ధనుష్. దీంతో ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేశారు. సైకో థ్రిల్లర్‌‌కు హర్రర్ టచ్ ఉన్న కథ కావడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Read More : Tollywood : చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఏం చదువుకున్నారో తెలుసా? టాప్‌10 టాలీవుడ్‌ స్టార్ హీరోల క్వాలిఫికేషన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!