ఇంత స్లిమ్ లుక్ ఏంటి డార్లింగ్ అంటున్న ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్.. ఆదిపురుష్ టీమ్‌కు ఓం రౌత్ పార్టీ

Updated on Jun 15, 2022 06:43 PM IST
ఓం రౌత్ ఇంటికి వెళ్లిన ప్ర‌భాస్‌ (Prabhas)ను చూసిన‌ ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. స్లిమ్ లుక్‌లో డార్లింగ్ చాలా అందంగా క‌నిపించారు.
ఓం రౌత్ ఇంటికి వెళ్లిన ప్ర‌భాస్‌ (Prabhas)ను చూసిన‌ ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. స్లిమ్ లుక్‌లో డార్లింగ్ చాలా అందంగా క‌నిపించారు.

టాలీవుడ్‌లో ప్ర‌భాస్  (Prabhas) ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈశ్వ‌ర్ సినిమాతో రెబ‌ల్ స్టార్‌గా కెరియ‌ర్ స్టాట్ చేసిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా కొన‌సాగుతున్నారు. రాధే శ్యామ్ త‌ర్వాత ప్ర‌భాస్ అభిమానుల కోసం కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. చాలా సినిమాల్లో న‌టించి త‌న అభిమానుల‌ను సంతోష పెట్టాల‌ని ప్ర‌భాస్ ప్లాన్ చేస్తున్నారు. వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌పై ఫోక‌స్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రాజెక్ట్ కె, స‌లార్, ఆదిపురుష్ సినిమాల‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

వెండితెర‌పై హీరోల‌ను అందంగా చూపించాల‌నుకే ద‌ర్శ‌కుల్లో ప్ర‌శాంత్ నీల్ ఒక‌రు. స‌లార్‌లో ప్ర‌భాస్ (Prabhas) లుక్ కోసం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు ప్ర‌శాంత్ నీల్. కాస్త స్లిమ్ లుక్‌తో యాక్ష‌న్ సీన్స్‌కు స‌రిపోయేలా ప్ర‌భాస్ బాడీ ఫిటినెస్‌పై శ్ర‌ద్ధ పెట్టారు. 

ప‌ట్టాలెక్క‌నున్న ఆదిపురుష్
బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఇంటికి వెళ్లిన ప్ర‌భాస్‌ను చూసిన‌ ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. స్లిమ్ లుక్‌లో డార్లింగ్ చాలా అందంగా క‌నిపించారు. చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. బ్లాక్ జీన్స్, బ్రింజాల్ కలర్ షర్ట్‌, ట్రెండీ షూలో ప్ర‌భాస్ హ్యాండ్స‌మ్‌గా క‌నిపించారు. 

హీరో లుక్‌పై ఫోక‌స్ పెట్టిన ప్ర‌శాంత్ నీల్
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాలో స్టైలిష్ లుక్ కార‌ణంగానే ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel.) త‌న‌ను హీరోగా సెలెక్ట్ చేశార‌ని య‌శ్ చాలా సార్లు చెప్పారు. ప్ర‌శాంత్ నీల్ హీరో ప‌ర్స‌నాలిటీ, మేక‌ప్, కాస్టూమ్స్‌పై చాలా కేర్ తీసుకుంటార‌నిపిస్తుంది. సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ త‌ర్వాతే మిగ‌తా వారు. హీరో ఓరియంట‌డ్ సినిమాల్లో హీరో లుక్ బాగుండేలా ప్లాన్ చేస్తారు. అందుకే ప్ర‌భాస్‌ను కూడా త‌న సినిమాకు కావాల్సిన విధంగా మార్చేస్తున్నారు. ప్ర‌భాస్ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. డార్లింగ్ (Prabhas) అభిమానులు మాత్రం ప్ర‌భాస్ లేటెస్ట్ పిక్స్ చూసి వావ్ అంటున్నారు. 

స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చాలా సినిమాల్లో న‌టిస్తున్నారు. 'స‌లార్‌'తో పాటు ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌తీ సినిమా కూడా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్నదే. త‌న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ప్ర‌భాస్ బిజీగా మారారు. సినిమా సినిమాకు లుక్ వైజ్‌గానే కాకుండా యాక్టింగ్ సీన్ల‌తో అద‌ర‌గొట్ట‌డానికి కూడా రెడీగా ఉన్నారు ప్ర‌భాస్.  

Read More:డార్లింగ్ ప్ర‌భాస్ (Prabhas) లుక్ చూసి వావ్ అంటున్న ఫ్యాన్స్.. ప్ర‌శాంత్ నీల్ వ‌ల్లే సాధ్య‌మైందా?
  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!