"కృతి సనన్ (Kriti Sanon) మనసులో ఉన్న హీరో దీపికా పదుకొణెతో (Deepika Padukone) బిజీగా ఉన్నాడు": వరుణ్ ధావన్!

Updated on Nov 28, 2022 11:47 AM IST
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon), ప్రభాస్ (Prabhas) ప్రేమించుకుంటున్నారనే వార్తలు అక్కడి మీడియా నుంచి బాగా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon), ప్రభాస్ (Prabhas) ప్రేమించుకుంటున్నారనే వార్తలు అక్కడి మీడియా నుంచి బాగా వినిపిస్తున్నాయి.

ఇండియాలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా చేరిపోయాడు. దీంతో ఆయన మీద ఎఫైర్ రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. పలువురు హీరోయిన్స్ తో ఆయన ఎఫైర్ నడిపారని వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బ్యూటీ అనుష్క పేరు ఎక్కువగా వినిపించింది. అనుష్కతో ప్రభాస్ వివాహం ఖాయమే అంటూ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఖండిస్తూ వచ్చారు. 

అయితే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon), ప్రభాస్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు అక్కడి మీడియా నుంచి బాగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆదిపురుష్ టీజర్ ప్రమోషన్స్ లో కృతి సనన్ ప్రభాస్ ని చేయి పట్టించుకోని నడిపించడం, ప్రభాస్ కి చెమట వస్తే తన చీర కొంగు ఇవ్వడం, బాలీవుడ్ లో ఒక షోకి వెళ్తే ప్రభాస్ కి కాల్ చేయడం, ఓ ఇంటర్వ్యూలో ఛాన్స్ ఉంటే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం.. ఇలా అనేక సంఘటనలు చూసి ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారేమో అని అభిప్రాయపడుతున్నారు.

ఓ టీవీ డిబేట్ లో.. కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ (Prabhas) ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తారు? ఎవరితో డేట్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురవగా.. కార్తీక్ తో ఫ్లర్టింగ్, టైగర్ తో డేటింగ్, ప్రభాస్ నీ పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చింది. ఇకపోతే తాజాగా కృతి సనన్.. మనసులో ప్రభాస్ ఉన్నట్లు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

వరుణ్ ధావన్, కృతి సనన్ ‘బేడియా’ అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్, వరుణ్ ధావన్ పలు షోలలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆలా ఒక షోలో యాంకర్ గా కరణ్ జోహార్ ఉన్నారు.

ఈ షోలో కరణ్ జోహార్ కృతి సనన్ (Kriti Sanon) ని.. నీ హార్ట్ లో ఎవరు ఉన్నారు అని అడగడంతో వరుణ్ ధావన్ దీనికి సమాధానమిస్తూ.. కృతి సనన్ మనసులో ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ప్రస్తుతం ముంబయిలో లేడు. ప్రస్తుతం దీపికా పదుకొనేతో (Deepika Padukone) సినిమా షూటింగ్ లో ఉన్నాడు అని చెప్పాడు. దీంతో అది ప్రభాస్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ దీపికా పదుకొనే 'ప్రాజెక్ట్ K' (Project K) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో కృతి సనన్, ప్రభాస్ ఎఫైర్ నిజమేనని వార్తలు గుప్పుమంటున్నాయి.

Read More: ‘ఆదిపురుష్‌’ (Adipurush) మూవీలో నటించడం నాకు గర్వకారణం.. హీరోయిన్ కృతీ సనన్‌ (Kriti Sanon) ఆసక్తికర కామెంట్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!