Adipurush:ఆదిపురుష్ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే!

Updated on Jun 02, 2022 04:34 PM IST
ఆదిపురుష్  (Adipurush) సినిమా కోసం అక్ష‌రాల రూ.500 కోట్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని నిర్మాత భూష‌ణ్ కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.
ఆదిపురుష్ (Adipurush) సినిమా కోసం అక్ష‌రాల రూ.500 కోట్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని నిర్మాత భూష‌ణ్ కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) సినిమా ఆదిపురుష్ ప్రపంచ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రామాయ‌ణ నేప‌థ్యంలో ఆదిపురుష్ మూవీని అద్భుతంగా డైరెక్ట్ చేయ‌నున్నారు. ఈ సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌గా నిర్మించేందుకు నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌ను రెడీ చేస్తున్నారు. అక్ష‌రాల 2 వేల కోట్ల రూపాయ‌ల‌తో ఆదిపురుష్ సినిమాను నిర్మిస్తున్నారు. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుంటే... రావ‌ణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అలీ ఖాన్ క‌నిపించ‌నున్నారు. సీత‌గా కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో యాక్ట్ చేయ‌నున్నారు.

ప్రభాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. 3డీ సినిమా ఆదిపురుష్ కోసం వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ట‌. అక్ష‌రాల రూ.500 కోట్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని నిర్మాత భూష‌ణ్ కుమార్  చెప్పారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇంత పెద్ద బ‌డ్జెట్‌తో తీసిన చిత్రం ఆదిపురుష్ సినిమానే అట‌. ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

సినిమా ఇండ‌స్ట్రీలో తాను రెండు వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్టాన‌ని నిర్మాత భూష‌ణ్ కుమార్ చెప్పారు. భారీ బ‌డ్జెట్ సినిమాలు తీస్తున్నాన‌ని అన్నారు. రూ.400 కోట్ల‌ను ఆదిపురుష్ కోసం ఖ‌ర్చు చేశాన‌ని చెప్పారు. భూష‌ణ్ కుమార్ రూ.400 కోట్లు ఖ‌ర్చు చేస్తే.. మ‌రో వంద‌ల కోట్ల రూపాయ‌లు ప్ర‌మోషన్ల కోసం ఖర్చు చేశారు. మొత్తం లెక్క‌ల ప‌రంగా చూస్తే ఆదిపురుష్ (Adipurush) సినిమా కోసం రూ.500 కోట్లు ఖ‌ర్చు చేశార‌న‌మాట‌. 

 

ఆదిపురుష్ (Adipurush) సినిమా కోసం అక్ష‌రాల రూ.500 కోట్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని నిర్మాత భూష‌ణ్ కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఆదిపురుష్ (Adipurush) విడుద‌ల కంటే ముందు భారీ బిజినెస్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేయ‌లేదు. ప్ర‌భాస్ సినిమా ఆదిపురుష్ ప్ర‌తీ అప్‌డేట్ ట్రెండ్ సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టికెట్ రేటు కూడా పెంచాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉంద‌ట‌. ఎందుకంటే ఆదిపురుష్ లాంటి సినిమాల టికెట్ రేటు ఎంతైనా ప్రేక్ష‌కులు చూస్తార‌ని నిర్మాత భూష‌ణ్ కూడా అంటున్నారు. సంక్రాంతికి బ‌రిలోకి దిగేందుకు ఆదిపురుష్ రెడీ అవుతుంది. 2023 జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!