దివికేగిన ‘సినీ ధ్రువతార’: రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అస్తమయం.. విషాదంలో ఇండస్ట్రీ

Updated on Sep 11, 2022 01:16 PM IST
ప్రభాస్ (Prabhas) నటించిన రాధే శ్యామ్ సినిమాలో చివరిసారిగా వెండితెరపై కనిపించారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు (KrishnamRaju)
ప్రభాస్ (Prabhas) నటించిన రాధే శ్యామ్ సినిమాలో చివరిసారిగా వెండితెరపై కనిపించారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు (KrishnamRaju)

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (KrishnamRaju) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆరోగ్యం మరింత దిగజారడంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు కృష్ణంరాజు.

ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రేపు ఉదయం హైదరాబాద్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)ను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన ఘనత కృష్ణంరాజుకే దక్కుతుంది.

హీరోగా.. విలన్‌గా..

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940, జనవరి 20న కృష్ణంరాజు (KrishnamRaju) జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తైన తర్వాత కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. హీరోగా సినిమాల్లోకి వచ్చిన కృష్ణంరాజు విలన్‌గా కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ప్రభాస్ (Prabhas) నటించిన రాధే శ్యామ్ సినిమాలో చివరిసారిగా వెండితెరపై కనిపించారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు (KrishnamRaju)

నిర్మాతగా కూడా..

విలక్షణమైన నటనతో టాలీవుడ్‌ను ఏలిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు 183కుపైగా సినిమాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గోపీకృష్ణ బ్యానర్‌ స్థాపించి  పలు చిత్రాలను కూడా నిర్మించారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో కృష్ణంరాజు (KrishnamRaju) చివరిసారి వెండితెరపై కనిపించారు.

కేంద్ర మంత్రిగా..

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే కృష్ణంరాజు రాజకీయాల్లోకి వచ్చారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ప్రభాస్ (Prabhas) నటించిన రాధే శ్యామ్ సినిమాలో చివరిసారిగా వెండితెరపై కనిపించారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు (KrishnamRaju)

1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నర్సాపురం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు కృష్ణంరాజు (KrishnamRaju).

అవార్డులు..

ఉత్తమ నటుడిగా 1977, 1984లో కృష్ణంరాజు నంది అవార్డులు పొందారు. 1986లో తాండ్ర పాపారాయుడు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు కృష్ణంరాజు (KrishnamRaju). కృష్ణంరాజును చూడడానికి ఇటీవల హాస్పిటల్‌కు వచ్చిన ప్రభాస్‌ (Prabhas) వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.

Read More : 'స‌లార్' (Salaar) కోసం ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్ ! ప్ర‌భాస్‌ (Prabhas) పై ద‌ర్శ‌కుడి అసంతృప్తి నిజ‌మేనా ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!