నాకు తెలిసిన మొదటి హీరో కృష్ణంరాజు (Krishnam Raju).. మా ఫ్యామిలీకి సన్నిహితులు: పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సినీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) భౌతికకాయానికి నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాళులు అర్పించారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. 'ప్రముఖ నటులు, నిర్మాత.. అంతకుమించి మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తి కృష్ణంరాజు స్వర్గస్థులవ్వడం ఎంతో బాధ కలిగించిందని' అన్నారు.
'మేం కలిసి మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయినా కృష్ణంరాజు గారు, ఆయన సతీమణి నా మీద ఎంతో ప్రేమ, వాత్సల్యం చూపించేవారు. చెన్నైలో కృష్ణంరాజు గారు ఉండే వీధిలోనే మేమూ ఉండేవాళ్లం. 'మనవూరి పాండవులు' సినిమా రిలీజ్ అయ్యాక, మా అన్నయ్య చిరంజీవితోపాటు.. జీవితంలో నేను విన్న మొదటి హీరో పేరు కృష్ణంరాజు'
అందరి బాగు కోరే వ్యక్తి..
'పార్లమెంటేరియన్‌గా ఉన్న సమయంలో కూడా, అందరికీ చేదోడువాదోడుగా ఉండే వ్యక్తి కృష్ణంరాజు. అందరి మంచిని కోరుకునే వ్యక్తి. యాక్టర్‌గానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన మంచి సినిమాలు నిర్మించారు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కృష్ణంరాజు' అని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
'ప్రభాస్, ఆయన చెల్లెళ్లు, కృష్ణంరాజు గారి సతీమణితో పాటు, ఆయన అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు (Krishnam Raju) గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan).
Read More : రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అద్భుత నటనకు అద్దంపట్టే టాప్10 సినిమాలు..