Shruti Hassan: ప్రేమ, అఫైర్లు, డేటింగ్ విషయాలపై ఓపెన్ అయిన శృతి హాసన్!

Updated on May 26, 2022 09:37 PM IST
శృతి హాసన్ (Shruti Hassan)​
శృతి హాసన్ (Shruti Hassan)​

టాలీవుడ్​ టు బాలీవుడ్​లో వరుసగా ​సినిమాలతో చేస్తూ స్టార్​ హీరోయిన్​ శృతి హాసన్ (Shruti Hassan)​ ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు. సినిమా ఇండ‌స్ట్రీలో బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్లలో శృతిహాసన్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. శృతి హాసన్‌కు నిత్యం మీడియా కెమెరాలకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ కావడం, డేటింగ్ వార్తలతో పతాక శీర్షికలను ఆకర్షించడం సర్వసాధారణం అయిపోయాయి. ప్ర‌స్తుతం అగ్ర నటులతో, భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చింది. అందులో తన ప్రేమ విషయాలు, అఫైర్లు, డేటింగ్ లాంటి ప‌లు విషయాలపై కుండ బద్దలు కొట్టినట్టు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్​ చర్చనీయాంశంగా మారాయి. ఈ సంద‌ర్భంగా ఆమె.. త‌న‌ తల్లిదండ్రులు కమల్ హాస‌న్​-సారిక విడాకులపై కూడా స్పందించారు. 

ముంబయి నాకు సొంత నగరం లాంటింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ (Bollywood) లో కూడా బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. మా అమ్మా నాన్న విడిపోయినప్పటి నుంచి నేను ముంబయిలోనే పెరిగాను. అమ్మతో కలిసి హిందీ మాట్లాడుతాను అని పేర్కొంది. 2009లో లక్ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత‌ చాలా సినిమాలు చేసింది. కానీ అంతగా నాకు గుర్తింపు లభించలేదు. తాజాగా పలు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే శృతిహాసన్ (Shruti Hassan) మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఇక‌, ఈ భామ‌ తన జీవితంలోని అఫైర్లు, డేటింగ్ గురించి ఓపెన్ అవుతూ... శంతను హజారికాకు నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారి ద్వారానే మా పరిచయం జరిగిందని పేర్కొంది. సినిమా, మ్యూజిక్, కళల గురించే మేమిద్దరం కామన్ గా మాట్లాడుకుంటామ‌ని... అందుకే మేమిద్దరం చాలా దగ్గరయ్యామ‌ని.. శంతను లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారని తెలిపింది.
 
శృతిహాసన్ (Shruti Hassan) ఇంకా మాట్లాడుతూ.. నేను గతంలో చాలా మంది యాక్టర్లతో డేటింగ్ చేశా. కానీ వాళ్లతో వర్కవుట్ కాలేదని తెలిపింది. అయితే, మా ఇద్ద‌రి బంధంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని, శంతను హజారికాను కలిసిన తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయిందని పేర్కొంది. ఆయ‌న‌ నా అభిరుచులను గౌరవిస్తాడు. నేనంటే ఆయ‌న‌కు మంచి అభిప్రాయం ఆయనకు ఉంది. వినోద పరిశ్రమలో అలాంటి వాళ్లు అరుదుగా ఎదురుపడుతారు. అందుకే ఆయనకు దగ్గరయ్యాను. తొలిసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో ప్రేమలో పడ్డాను. మా డేటింగ్ వ్యవహారం సవ్యంగా సాగుతున్నదని శృతి హాసన్ తెలిపింది. అయితే.. నా జీవితంలో పెళ్లి ప్రస్తావన ఇప్ప‌టికే చాలా సార్లు వచ్చింది. పెళ్లి అనే విషయం రాగానే నేను చాలా నెర్వస్‌గా ఫీలవుతాను. ఆ బంధంలోకి అంత త్వరగా నేను దూరిపోలేను. అందుకే పెళ్లి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నాపై నా తల్లిదండ్రుల పెళ్లి ప్రభావం ఎక్కువగానే ఉంది. పెళ్లి వర్కౌట్ అయితే జీవితం చాలా బాగుంటుంది. వర్కౌట్ అయినా కాకున్నా నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. నా తల్లిదండ్రుల విషయంలో వర్కవుట్ కాకపోతే వివాహ వ్యవస్థపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు అని ఆమె వివ‌రించింది.

శృతి హాసన్ (Shruti Hassan)​ సినిమాల‌ విష‌యానికి వ‌స్తే.. ఆమె కెరీర్​ ఈ ఏడాది జెట్​ స్పీడుతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్​ చిరంజీవితో 'చిరు105', బాలయ్యతో 'ఎన్​బీకే 107', ప్రభాస్‌తో సలార్​లో నటిస్తోంది. అలాగే ఓ వెబ్​సిరీస్​తో పాటు పలు దక్షిణాది సినిమాలకు కూడా ఇప్ప‌టికే క‌మిట్ ​అయింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!