ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న యూవీ క్రియేషన్స్..రాధేశ్యామ్‌ నష్టాలు తీరేనా?

Updated on Sep 04, 2022 06:29 PM IST
ప్రభాస్ (Prabhas), కృతిసనన్‌ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది విడుదల కానుంది
ప్రభాస్ (Prabhas), కృతిసనన్‌ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది విడుదల కానుంది

‘బాహుబ‌లి’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో పాన్‌ ఇండియా కథలే ప్రభాస్  వద్దకు వెళుతున్నాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు కూడా అదే రేంజ్‌లో రిలీజైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక చతికిలపడ్డాయి. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రాజెక్ట్‌ కె, ఆదిపురుష్, సలార్ పాన్‌ ఇండియా సినిమాలే. డైరెక్టర్‌‌ మారుతితో సినిమా చేసేందుకు ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్.

 ‘త‌న్హాజీ’ ఫేం ఓం రౌత్ ద‌ర్శక‌త్వంలో ప్రభాస్ నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ‌య‌ణ క‌థ‌ను బేస్ చేసుకొని తెర‌కెక్కిన ఆదిపురుష్‌ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది.

ప్రభాస్ (Prabhas), కృతిసనన్‌ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది విడుదల కానుంది

అప్‌డేట్లు, పోస్టర్లు రిలీజ్ కాలే..

ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించి ఇప్పటివ‌ర‌కు మేక‌ర్స్ ఎలాంటి పోస్టర్లు, అప్‌డేట్లు ఇవ్వలేదు. అయినా ఆదిపురుష్‌ సినిమాపై ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులతోపాటు సినీ ప్రముఖులకు కూడా ఆసక్తి నెలకొంది. దాంతో ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ ద‌క్కించుకుంద‌ని టాక్. ఆదిపురుష్ హ‌క్కులను భారీ మొత్తంలోనే కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమాతో వచ్చిన నష్టాలను ఈ చిత్రం క‌వ‌ర్ చేస్తుంద‌ని యూవీ క్రియేష‌న్స్ మేనేజ్‌మెంట్ ధీమాను వ్యక్తం చేస్తోంది.

ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్ రాముడి క్యారెక్టర్‌‌లో, కృతిస‌నన్ సీత పాత్రలో న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్ర పోషించారు. ప్రభాస్ అభిమాని ఒకరు డిజైన్ చేసిన ఆదిపురుష్ కాన్సెప్ట్ ఆర్ట్ నెట్టింట వైర‌ల్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఆదిపురుష్‌ సినిమాను దాదాపు 15 భాష‌ల్లో ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం.

Read More : ప్రభాస్ (Prabhas) పుట్టినరోజున బిల్లా సినిమా రీరిలీజ్.. పండుగ చేసుకోనున్న పాన్‌ ఇండియా స్టార్ ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!