ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌కు అదిరిపోయే హింట్‌ ఇచ్చిన ‘సలార్’ చిత్ర యూనిట్..‘వయొలెంట్‌’ అని ట్వీట్‌

Updated on Sep 04, 2022 03:12 PM IST
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సలార్‌‌ సినిమా షెడ్యూల్‌ సెప్టెంబర్‌‌లో స్టార్‌‌ కానున్నట్టు తెలిసింది
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సలార్‌‌ సినిమా షెడ్యూల్‌ సెప్టెంబర్‌‌లో స్టార్‌‌ కానున్నట్టు తెలిసింది

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో సలార్ (Salaar) కూడా ఒకటి. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ వెర్షన్స్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ కూడా బాగా చూపించారు ప్రశాంత్ నీల్. ప్రభాస్‌ సలార్ సినిమా కూడా ఇదే తరహాలో ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ సినిమా కథా నేపథ్యం ఏంటి అనే దానిపై ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులకు కూడా కలుగుతున్న సందేహం. ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరికేలా సలార్ చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ‘వయొలెంట్’ (VIOLENT) అనే పదంతో సలార్ సినిమా అఫీషియల్ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేసింది చిత్ర యూనిట్.

ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సలార్‌‌ సినిమా షెడ్యూల్‌ సెప్టెంబర్‌‌లో స్టార్‌‌ కానున్నట్టు తెలిసింది

లుక్‌ హైలైట్‌గా..

ఈ ట్వీట్‌ ప్రకారం.. సలార్‌‌ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్లు, హింసతో కూడిన సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. మరి ప్రభాస్‌ను ప్రశాంత్ నీల్‌ ఎలాంటి క్యారెక్టర్‌‌లో చూపించబోతున్నారో తెలియాలంటే సలార్ సినిమా టీజర్ లేదా ట్రైలర్ వస్తే గానీ ఒక క్లారిటీ రాదు. ఇప్పటికే రిలీజైన ప్రభాస్ లుక్ మాత్రం హైలెట్‌గా నిలిచింది.

సలార్ సినిమాలో శృతి హాసన్ ఆద్య క్యారెక్టర్‌‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా షెడ్యూల్‌ మొదలుకానుందని సమాచారం. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సలార్‌‌ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్ కిరంగదూర్‌‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2023, సెప్టెంబర్‌‌ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సలార్ (Salaar) సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.

Read More : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ సినిమాకి కాన్సెప్ట్‌ ఆర్ట్‌ డిజైన్ చేసిన అభిమాని.. నెట్టింట ఫోటో వైరల్ !

ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సలార్‌‌ సినిమా షెడ్యూల్‌ సెప్టెంబర్‌‌లో స్టార్‌‌ కానున్నట్టు తెలిసింది

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!