ప్రాజెక్ట్ కే (PROJECT K) కోసం ప్రాణం పెట్టి వ‌ర్క్ చేస్తాం: నాగ్ అశ్విన్‌

Updated on May 19, 2022 10:30 AM IST
Project K: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) ప్రాజెక్ట్‌ కే సినిమాపై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఓ అప్‌డేట్ ఇచ్చారు
Project K: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) ప్రాజెక్ట్‌ కే సినిమాపై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఓ అప్‌డేట్ ఇచ్చారు

Project K: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) ప్రాజెక్ట్‌ కే సినిమాపై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కే కోసం ఎలా వ‌ర్క్ చేస్తారో ప్ర‌భాస్ అభిమానుల‌కు చెప్పారు. నాగ్ అశ్విన్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. 

మ‌హాన‌టి సినిమాతో త‌న టాలెంట్ ఏంటో నిరూపించుకున్న డైరెక్ట‌ర్ నాగ అశ్విన్ (Nag Ashwin). సినిమా తీయ‌డంలో కొత్త స్టైల్‌తో పాటు అన్ని ఎమోష‌న్స్ వెండితెర‌పై పండిస్తారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా వివ‌రాలు ఓ అభిమానికి తెల‌పారు. దీంతో స‌లార్ సినిమా అప్‌డేట్‌తో ఖుషీ అవుతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు మ‌రో గుడ్ న్యూస్ అందిన‌ట్టైంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్‌ను గుర్తున్నామా అంటూ ట్విట్ట‌ర్‌లో అడిగారు. అందుకు నాగ్ అశ్విన్ వారికి చెప్పిన స‌మాధానం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. 
 

 
 
ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్ర‌భాస్ ఎంట్రీ సీన్ కూడా పూర్తి చేశాం. జూన్ నెల‌ఖారు నుంచి మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభిస్తాం. రిలీజ్ ఆర్ఢ‌ర్ ప్ర‌కారం నేను చేస్తున్న ప్రాజెక్ట్ కే చివ‌రిలో ఉంది. స‌లార్, ఆదిపురుష్ సినిమాల రిలీజ్ త‌ర్వాతే ప్రాజెక్ట్ కే సినిమా విడుద‌ల చేస్తాం. వ‌రుస అప్‌డేట్స్ ఇవ్వ‌డానికి ఇంకా టైం ఉంది. ప్రాజెక్ట్ కే కోసం అంద‌రం ప్రాణం పెట్టి వ‌ర్క్ చేస్తున్నాం.
నాగ్ అశ్విన్
 

Project K:ప్రాజెక్ట్ కే కోసం ఎలా వ‌ర్క్ చేస్తారో  ప్ర‌భాస్ అభిమానుల‌కు చెప్పారు నాగ్ అశ్విన్.

ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నస‌లార్ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ త‌ర్వ‌లో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌కి వెళ్ల‌నున్నారు. నాగ్ అశ్విన్‌తో వ‌ర్క్ చేయ‌డానికి వెయిట్ చేస్తున్నానంటూ ప్ర‌భాస్ రీసెంట్‌గా కోట్ చేశారు. అశ్వినీ ద‌త్ రూ.500 కోట్ల రూపాయ‌ల‌తో ప్రాజెక్ట్ కే తెర‌కెక్కిస్తున్నారు. హీరోయిన్ దీపికా పదుకునే ప్ర‌భాస్‌కు జోడిగా (Deepika Padukone) నటిస్తోంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాపై ఇచ్చిన రిప్లై చూసి ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంతోష‌ప‌డుతున్నారు. ప్రాణాలు ప‌ణంగా పెట్ట‌న‌వ‌స‌రం లేద‌ని.. ప్ర‌భాస్ సినిమా ఓ రేంజ్‌లో తీయాల‌ని నాగ్ అశ్విన్‌ను కోరుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!