'స‌లార్' (Salaar) కోసం ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్ ! ప్ర‌భాస్‌ (Prabhas) పై ద‌ర్శ‌కుడి అసంతృప్తి నిజ‌మేనా ?

Updated on Sep 06, 2022 02:35 PM IST
ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'స‌లార్' సినిమా గురించి ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్‌ ప‌డుతున్నార‌నే వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. 
ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'స‌లార్' సినిమా గురించి ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్‌ ప‌డుతున్నార‌నే వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. 

'బాహుబలి' సినిమా తరువాత ప్ర‌భాస్ (Prabhas) మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. పాన్ ఇండియా హీరోగా ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌ లానే ప్ర‌శాంత్ నీల్ కూడా కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారారు. ఇక వీరిద్ద‌రి కాంబోలో 'స‌లార్' సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. 'స‌లార్' చిత్రంలో కేజీఎఫ్ హీరో య‌శ్ కూడా యాక్ట్ చేయ‌నున్నారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే 'స‌లార్' సినిమా గురించి ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్‌ ప‌డుతున్నార‌నే వార్త‌లు సోషల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. 

బిజీగా మారిన ప్ర‌భాస్

ప్ర‌భాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా సినిమాగా 'స‌లార్' తెర‌కెక్కుతుంది. ఈ సినిమా త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మ‌రో సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే 'రాధేశ్యామ్' డిజాస్ట‌ర్ త‌రువాత, ఆయన వ‌రుస సినిమాల‌కు సైన్ చేశారు. ఒకేసారి మూడు సినిమాల్లో న‌టిస్తున్నారు. 'స‌లార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె' సినిమాల‌ షూటింగ్‌ల‌లో బిజీగా ఉన్నారు. 

ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'స‌లార్' సినిమా గురించి ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్‌ ప‌డుతున్నార‌నే వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. 

ప్ర‌భాస్ లుక్ కోసం టెన్ష‌న్

ప్ర‌శాంత్ నీల్ మాత్రం  ప్ర‌భాస్‌ (Prabhas) పై అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్ర‌భాస్ లుక్ విష‌యంలో ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మూడు ప్రాజెక్టుల కోసం ప్రభాస్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల, అత‌ని లుక్ 'స‌లార్‌'లో సీన్ సీన్‌కు మారిపోతుందేమోన‌ని భావిస్తున్నార‌ట‌. సాధారణంగా, సినిమాతో పాటు న‌టీన‌టుల లుక్ విష‌యంలో కూడా ప్ర‌శాంత్ నీల్ చాలా కేర్ తీసుకుంటారు. 'స‌లార్' సినిమా కోసం ప్ర‌భాస్ లుక్‌ను పూర్తిగా ప్ర‌శాంత్ నీల్ మార్చేశారు. ప్ర‌భాస్‌ను స్లిమ్ లుక్‌లో క‌నిపించేలా చేశారు.

ఇక 'ఆదిపురుష్‌'లో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. అదేవిధంగా, 'ప్రాజెక్ట్ కె'లో క‌ర్ణుడిగా న‌టిస్తార‌ని టాక్. ఈ సినిమాల మేక‌ప్ ఎఫెక్ట్ 'స‌లార్‌'పై ప‌డ‌కుండా చూస్తున్నారు ప్ర‌శాంత్.  ఈ క్రమంలో ప్రభాస్‌పై ప్ర‌శాంత్ అసంతృప్తిగా ఉన్నార‌నే వార్త‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్' సినిమాపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. 

ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'స‌లార్' సినిమా గురించి ప్ర‌శాంత్ నీల్ టెన్ష‌న్‌ ప‌డుతున్నార‌నే వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. 

ఈ చిత్రంలో ప్ర‌భాస్ డ‌బుల్ రోల్‌లో న‌టించ‌నున్నారు. ప్ర‌భాస్‌ (Prabhas)కు జోడిగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. కేజీఎఫ్ హీరో య‌శ్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అలాగే జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరిరావు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ‌ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో 'స‌లార్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను  చూస్తున్కనారు. 'స‌లార్' చిత్రాన్ని 2023లో తెలుగుతో పాటు క‌న్న‌డ‌ం, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. 

Read More: ప్ర‌భాస్ (Prabhas) సినిమా స‌లార్ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్.. ఏంటంటే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!